1 . తోటలో నీ స్వరము వినినపుడు "దిగంబరినిగా" నుంటినని ఎవరు యెహోవాతో అనెను?
2 . ఎవరు యూదా దేశమును "దిగంబరిగా" చేసెను?
3 . తల్లి గర్భములో నుండి "దిగంబరినై" వచ్చితిని,దిగంబరినై తిరిగి వెళ్ళెదనని ఎవరు అనెను?
4 . ఎవరు యెహోవా సెలవిచ్చినట్లు "దిగంబరియై" జోళ్ళు లేక నడుచుచుండెను?
5 . వేటికి సూచనగా సాదృశ్యముగా యెషయా మూడు సంవత్సరములు "దిగంబరియై"జోడు లేక నడిచెను?
6 . ఎవరు త్రాగి మత్తిల్లి తనకు తాను "దిగంబరినిగా" చేసుకొనెను?
7 . యెహోవా దినమందు ఎవరిలో బహుధైర్యము గలవాడు "దిగంబరియై" పారిపోవును?
8 . ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను తాను చేతపట్టుకొనిపోకుండా "దిగంబరిగానే" మరల పోవునదెవరు?
9 . బాల్యకాలమందు "దిగంబరియై" రక్తములో పొర్లుచుండిన సంగతిని మనస్సుకు తెచ్చుకొననిదెవరు?
10 . ఇశ్రాయేలువారు చేయు పాపమును బట్టి యెహోవా పలుకు సాక్ష్యమువిని "దిగంబరియై" నక్కలు అరుచునట్లు అరచుచున్నదెవరు?
11 . తాను "దిగంబరుడనై" యున్నానని యెరుగక యున్న సంఘము ఏది?
12 . ఎవరు దిగంబరులై భోజనము లేక యున్నప్పుడు,చలికాచుకొనుడి,తృప్తిపొందుడని చెప్పినయెడల ప్రయోజనమేమి?
13 . ఈ గడియ వరకు "దిగంబరులు"మని ఎవరు అనెను?
14. తన దిగంబర"శరీరము మీద నారబట్ట వేసుకొనిన వాడు ఎవరి వెంట నడిచెను?
15. తాను "దిగంబరుడుగా" సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని ఎలా యుండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు?
Result: