Bible Quiz in Telugu Topic wise: 4 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Boys" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. " బాలుడు" సహితము తన నడవడిక శుద్ధమైనదో యధార్థమైనదో కాదో దేని వలన తెలియజేయును?
ⓐ తన మాటల
ⓑ తన చూపుల
ⓒ తన ప్రవర్తన
ⓓ తన చేష్టల
2. బాలుని హృదయములో ఏది స్వాభావికముగా పుట్టును?
ⓐ గల్లత్తు
ⓑ అల్లరితనము
ⓒ మూఢత్వము
ⓓ పిరికితనము
3. నీవు బాలుడవు, నీకు బలము చాలదని ఎవరు దావీదుతో అనెను?
ⓐ ఏలీయాబు
ⓑ సౌలు
ⓒ షిమ్యా
ⓓ జనులు
4. బాలకులను యెరూషలేము యూదా దేశములలో యెహోవా ఎలా నియమించును?
ⓐ అధిపతులుగా
ⓑ చక్రవర్తులుగా
ⓒ రాజులుగా
ⓓ పాలకులుగా
5. బాలుడైన సమూయేలు ఎవరి యెదుట పరిచర్య చేయుచుండెను?
ⓐ హోష్నీ,ఫీనేహాసుల
ⓑ యాజకుడైన ఏలీ
ⓒ ఇశ్రాయేలు జనుల
ⓓ యూదా అధిపతుల
6. బాలకులు బాలచేష్టలు చేసి జనులను ఏమి చేయుదురు?
ⓐ బాధింతురు
ⓑ ఎగతాలి
ⓒ ఏలెదరు
ⓓ విసిగింతురు
7. బాలుడైన ఎవరు క్షేమముగా ఉన్నాడా అని దావీదు అహిమయస్సును అడిగెను?
ⓐ అదోనియా
ⓑ సొలొమోను
ⓒ ఆమ్నోను
ⓓ అబ్షాలోము
8. బాలురు సొమ్మసిల్లి ఏమవుదురు?
ⓐ అలయుదురు
ⓑ తొట్రిల్లుదురు
ⓒ పడిపోవుదురు
ⓓ నీరసించుదురు
9. పెద్దవానిపైన బాలుడు గర్వించి ఎలా నడుచును?
ⓐ అహంకారముగా
ⓑ తిరస్కారముగా
ⓒ మూర్ఖముగా
ⓓ డాంబికముగా
10. బాలురు జనులను ఏమి చేయుచున్నారు?
ⓐ హింసించుచున్నారు
ⓑ కొట్టుచున్నారు
ⓒ బాధపెట్టుచున్నారు
ⓓ నలుగగొట్టుచున్నారు
11. బాలుడు నడువవలసిన దేనిని వానికి నేర్పవలెను?
ⓐ కట్టడను
ⓑ మార్గమును
ⓒ గమ్యమును
ⓓ త్రోవను
12. బాలురను ఏమి చేయ మానకూడదు?
ⓐ శిక్షించుట
ⓑ తిట్టుట
ⓒ కొట్టుట
ⓓ తిరస్కరించుట
13. బాలునికి ఏమి రాకమునుపు యూదా దేశమును భయపెట్టు ఎఫ్రాయిము, సిరియ దేశము పాడుచేయబడును?
ⓐ వివేచన
ⓑ తెలివి
ⓒ మాటలు
ⓓ నడక
14. ఏమి తినిన బాలురైన దానియేలు షద్రకు మెషెకు ఆబేద్నెగో వారి ముఖములు సౌందర్యముగా కళగాను యుండెను?
ⓐ చేపలు
ⓑ మాంసము
ⓒ శాకాధాన్యములు
ⓓ పూరేళ్ళు
15. యెహోవా యొక్క ఎక్కడ దూడయు, కొదమసింహము పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును?
ⓐ మందిరము చుట్టూ
ⓑ ఆలయము వెలుపల
ⓒ పచ్చిక బయలులో
ⓓ పరిశుద్ధపర్వతముపైన
Result: