Bible Quiz in Telugu Topic wise: 401 || తెలుగు బైబుల్ క్విజ్ ("దీపము" అనే అంశముపై క్విజ్)

దీపము అనగా ఏమి ఇచ్చెడిది?
ⓐ కాంతి
ⓑ వెలుతురు(వెలుగు)
ⓒ కిరణములు
ⓓ పైవన్నియు
మనుష్యులు దీపము వెలిగించి ఎక్కడపెట్టుదురు?
ⓐ మిద్దెపైన
ⓑ అటకపైన
ⓒ దీపస్థంభముమీద
ⓓ గోడపైన
దేనికి దీపము కన్నుయై యున్నదని యేసు చెప్పెను?
ⓐ ముఖమునకు
ⓑ దేహమునకు
ⓒ తలకు
ⓓ శరీరమునకు
నరుని యొక్క ఏమి యెహోవా పెట్టిన దీపము?
ⓐ హృదయము
ⓑ మనస్సు
ⓒ ఆత్మ
ⓓ ఆలోచన
ఇశ్రాయేలీయులకు దీపముగా నున్న ఎవరు ఆరిపోకూడదని జనులు అనిరి?
ⓐ యాకోబు
ⓑ సొలొమోను
ⓒ యోవాషు
ⓓ దావీదు
దీపము వెలిగించిన యెహోవా దేనిని వెలుగుగా చేయును?
ⓐ చీకటిని
ⓑ ఆకాశమును
ⓒ భూమిని
ⓓ జలములను
రాత్రి వేళ ఎవరి దీపము ఆరిపోదు?
ⓐ గయ్యాళి
ⓑ సుబుద్ధి
ⓒ గుణవతి
ⓓ దాసురాలి
పౌలు సంఘము కూడియున్న ఎక్కడ అనేక దీపములు ఉండెను?
ⓐ ఆవరణములో
ⓑ యింటిలో
ⓒ మందిరములో
ⓓ మేడగదిలో
ఏ నాణెము పోగొట్టుకొనిన స్త్రీ దీపము వెలిగించి యిల్లు ఊడ్చెను?
ⓐ ఇత్తడి
ⓑ బంగారము
ⓒ గోమేధికము
ⓓ వెండి
తన తండ్రి తల్లినైనను దూషించు వాని దీపము ఎక్కడ ఆరిపోవును?
ⓐ అగాధములో
ⓑ కారు చీకటిలో
ⓒ అరణ్యములో
ⓓ ప్రయాణములో
దీపము దగ్గర గోడ పూత మీద హస్తము వ్రాయుట చూచిన బెల్టస్సరు ముఖము ఏమాయెను?
ⓐ వణికెను
ⓑ బిగిసెను
ⓒ వికారమాయెను
ⓓ మొద్దుబారెను
దీప వృక్షమునకు ఎన్ని దీపములు ఉండవలెను?
ⓐ ఆరు
ⓑ యేడు
ⓒ అయిదు
ⓓ పది
దీపము ఆరిపోక ముందు ఎవరు దేవుని మందసమున యెహోవా మందిరములో పండుకొనెను?
ⓐ దావీదు
ⓑ సౌలు
ⓒ సమూయేలు
ⓓ ఆసాపు
యెహోవా యొక్క ఏమి దీపముగాను ఉండును?
ⓐ ఉపదేశము
ⓑ ఆజ్ఞ
ⓒ కట్టడ
ⓓ విధి
సీయోను యొక్క ఏమి దీపము వలె వెలుగుచుండును?
ⓐ నీతి
ⓑ న్యాయము
ⓒ విశ్వాసము
ⓓ రక్షణ
Result: