Bible Quiz in Telugu Topic wise: 402 || తెలుగు బైబుల్ క్విజ్ ("దీర్ఘదర్శి" అనే అంశము పై క్విజ్)

"SEER" అనగా అర్ధము ఏమిటి?
Ⓐ ప్రభువు
Ⓑ తీర్పరి
Ⓒ సేవకుడు
Ⓓ దీర్ఘదర్శి
ఇప్పుడు ఏమియను పేరు నొందువాడు పూర్వము "దీర్ఘదర్శి"యనిపించుకొనును?
Ⓐ బోధకుడు
Ⓑ సేవకుడు
Ⓒ ప్రవక్త
Ⓓ కాపరి
దేవుని యొద్ద విచారణ చేయునపుడు మనము "దీర్ఘదర్శి"కుని యొద్దకు పోవుదుమనునది పూర్వము ఏమై యున్నది?
Ⓐ సామెత
Ⓑ వాడుక
Ⓒ అలవాటు
Ⓓ రుజువు
సౌలు తన గార్ధభముల కొరకు "దీర్ఘదర్శి"యైన ఎవరి యొద్దకు వెళ్ళెను?
Ⓐ సమూయేలు
Ⓑ ఆహీయా
Ⓒ షెమాయా
Ⓓ హనానీ
దావీదుకు "దీర్ఘదర్శి"ఎవరు?
Ⓐ బెనాయా
Ⓑ గాదు
Ⓒ అబీషై
Ⓓ యోనాతాను
దేవుని విషయములో హేమాను ఎవరికి "దీర్ఘదర్శి"గా నుండెను?
Ⓐ సొలొమోనుకు
Ⓑ రెహబాముకు
Ⓒ దావీదుకు
Ⓓ సౌలుకు
"దీర్ఘదర్శి"యైన హనానీ యూదా రాజైన ఎవరి యొద్దకు వచ్చెను?
Ⓐ అబీయా
Ⓑ రెహబాము
Ⓒ యోహు
Ⓓ ఆసా
నీవు "దీర్ఘదర్శి"వి కావా? నీవు పట్టణమునకు పోవలెనని దావీదు ఎవరితో అనెను?
Ⓐ నాతానుతో
Ⓑ గాదుతో
Ⓒ సాదోకుతో
Ⓓ ఇత్తయితో
నెబాతు కుమారుడైన యరొబాము గూర్చి "దీర్ఘదర్శి"యైన ఎవరి గ్రంధమందు వ్రాయబడియున్నది?
Ⓐ అహీయా
Ⓑ ఇద్దో
Ⓒయోహు
Ⓓ షెమయా
"దీర్ఘదర్శి"యైన హనానీ కుమారుడైన ఎవరు యెహోషాపాతును ఎదుర్కొనెను?
Ⓐ యెహూ
Ⓑ మీకాయా
Ⓒ అహీయా
Ⓓ షెమయా
"దీర్ఘదర్శులు"సమూయేలు గాదు రాజైన దావీదు యొక్క వేటిని గూర్చి చెప్పిన మాటలు వ్రాయబడియున్నవి?
Ⓐ రాజరికము
Ⓑ పరాక్రమము
Ⓒ కార్యములు
Ⓓ పైవన్నియు
ఎవరు చేసిన కార్యములను గూర్చి యెహోవా పేరట "దీర్ఘదర్శులు"చెప్పిన మాటలు వ్రాయబడియున్నవి?
Ⓐ మనషే
Ⓑ యోతాము
Ⓒ ఆమోను
Ⓓ అమజ్యా
దేనికి శిరస్సులుగా ఉన్న "దీర్ఘదర్శులకు" యెహోవా ముసుకు వేసియున్నాడు?
Ⓐ మోయాబుకు
Ⓑ అరీయేలుకు
Ⓒ ఎదోముకు
Ⓓ దమస్కునకు
దీర్ఘదర్శి"యైన ఎవరిని తప్పించుకొని పారిపొమ్ము అని అమజ్యా అనెను?
Ⓐ హగ్గయిని
Ⓑ హోషేయాను
Ⓒ ఆమోసును
Ⓓ యోవేలును
ప్రదర్శనములు రాకుండా చీకటి కమ్మునపుడు "దీర్ఘదర్శులు"సిగ్గునొందుదురని ఎవరు ప్రవచించెను?
Ⓐ జెకర్యా
Ⓑ మలాకీ
Ⓒ జెఫన్యా
Ⓓ మీకా
Result: