1. "దీర్ఘశాంతము" అనగా ఏమిటి?
2. "దీర్ఘశాంతుడు"ఏమి అణచివేయును?
3. "దీర్ఘశాంతము" వేటిలో ఒకటై యుండెను?
4. "దీర్ఘశాంతము"గలవాడు ఎటువంటివాడు?
5. పిలువబడిన పిలుపుకు తగినట్టుగా "దీర్ఘశాంతముతో"కూడిన వేటినిబట్టి నడచుకొనవలెను?
6. ఒకని యొక్క ఏమి వానికి "దీర్ఘశాంతము"నిచ్చును?
7. తనకు మొర్రపెట్టువారికి ఏమి తీర్చుటకు దేవుడు "దీర్ఘశాంతము"చూపుచుండెను?
8. ఎవరి కంటే "దీర్ఘశాంతము"గలవాడు శ్రేష్టుడు?
9. సంపూర్ణమైన "దీర్ఘశాంతముతో"ఏమి చేయుచు,ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పవలెను?
10. ఎవరును నశించివలెనని యిచ్ఛయింపక, అందరు ఏమి పొందవలెనని దేవుడు "దీర్ఘశాంతము"గలవాడై యుండెను?
11. ఎవరి యెడల "దీర్ఘశాంతము"గల వారమై యుండవలెను?
12. "దీర్ఘశాంతము"చేత ఎవరిని ఒప్పించవచ్చును?
13. యేసుక్రీస్తు తనదైన "దీర్ఘశాంతమును" ప్రధానపాపినైన నా యందు కనుపరచెనని ఎవరు చెప్పెను?
14. దేవుని "దీర్ఘశాంతమును"కనిపెట్టుచుండినప్పుడు చెరలోనున్న వారి యొద్దకు ఎలా వచ్చి దేవుడు ప్రకటించెను?
15. క్షమించుటకు సిద్ధమనస్సు కలిగి దయావాత్సల్యత "దీర్ఘశాంతము"ను బహుకృపగల దేవుడు తన ప్రజలను ఏమి చేయలేదు?
Result: