Bible Quiz in Telugu Topic wise: 408 || తెలుగు బైబుల్ క్విజ్ ("దుర్నీతి" అనే అంశము పై క్విజ్ )

1. సకల "దుర్నీతి" ఏమియై యున్నది?
ⓐ పాపము
ⓑ కపటము
ⓒ ద్రోహము
ⓓ అవిధేయత
2. "దుర్నీతి" బంధకములలో నీవు ఉన్నట్టు నాకు కనబడుచున్నదని ఎవరు గారడీసీమోనుతో అనెను?
ⓐ పౌలు
ⓑ పేతురు
ⓒ యోహాను
ⓓ యాకోబు
3. "దుర్నీతి"విషయమై సంతోషింపక దేని యందు సంతోషింపవలెను?
ⓐ నీతి
ⓑ న్యాయము
ⓒ సత్యము
ⓓ ధర్మము
4. "దుర్నీతి" చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క దేని మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరుచున్నది?
ⓐ సమస్త బుద్ధిహీనత
ⓑ సమస్త బలహీనత
ⓒ సమస్త కల్మషము
ⓓ సమస్త భక్తిహీనత
5. ఎక్కడ దేవునికి చోటియ్యనొల్లక పోయిన వారు సమస్త "దుర్నీతి"తో నిండుకొనియున్నారు?
ⓐ తమ ఆలోచనలలో
ⓑ తమ హృదయములో
ⓒ తమ మనస్సులలో
ⓓ తమ యోచనలలో
6. సత్యమునకు లోబడక "దుర్నీతికి" లోబడు వారిమీద దేవుని యొక్క ఏమి వచ్చును?
ⓐ కోపము ; తీర్పు
ⓑ ఉగ్రత ; రౌద్రము
ⓒ నాశనము ; క్రోధము
ⓓ ఆగ్రహము ; కోపము
7. మన యొక్క వేటిని "దుర్నీతి" సాధనములుగా పాపమునకు అప్పగింపకూడదు?
ⓐ చెవులను
ⓑ కన్నులను
ⓒ అవయవములను
ⓓ చేతులను
8. దేనికి "దుర్నీతితో" సాంగత్యము ఉండకూడదు?
ⓐ న్యాయమునకు
ⓑ ధర్మమునకు
ⓒ మంచితనమునకు
ⓓ నీతికి
9. "దుర్నీతిని" పుట్టించు దేనితో నశించుచున్నవారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును?
ⓐ సమస్త మోసముతో
ⓑ సమస్త కపటముతో
ⓒ సమస్త ద్వేషముతో
ⓓ సమస్త ఈర్ష్యతో
10. సత్యమును నమ్మక "దుర్నీతి ' యందు ఏమి గలవాడు శిక్షావిధి నొందును?
ⓐ ఇష్టము
ⓑ అభిలాష
ⓒ వాంఛ
ⓓ కోరిక
11. "దుర్నీతి" పరులను ఎప్పటి వరకు దేవుడు కావలిలో యుంచెను?
ⓐ అంతము
ⓑ ప్రభురాకడ
ⓒ తీర్పు దినము
ⓓ ఒక కాలము
12. "దుర్నీతి" వలన కలుగు బహుమానము ప్రేమించినదెవరు?
ⓐ బిలాము
ⓑ గేహాజీ
ⓒ ఏశావు
ⓓ కయీను
13. భ్రష్టులైన వారు ఎవరి నీతిని "దుర్నీతిగా" కనబడచేయుదురు?
ⓐ న్యాయవంతుల
ⓑ నీతిమంతుల
ⓒ బుద్ధిమంతుల
ⓓ సత్యవంతుల
14. మన "దుర్నీతి"దేవుని యొక్క నీతిని ఏమి చేయునని పౌలు చెప్పెను?
ⓐ హెచ్చించును
ⓑ స్థాపించును
ⓒ ప్రసిద్ధి
ⓓ నిర్మించును
15. నమ్మదగిన వాడైన ప్రభువు మన పాపములను క్షమించి సమస్త "దుర్నీతి" నుండి మనలను ఏమి చేయును?
ⓐ నిర్దోషులుగా
ⓑ నిష్కళంకులుగా
ⓒ నిందారహితులుగా
ⓓ పవిత్రులనుగా
Result: