Bible Quiz in Telugu Topic wise: 410 || తెలుగు బైబుల్ క్విజ్ ("దుష్టులు" అనే అంశము పై క్విజ్-2)

① దుష్టుని యొక్క ఏమి ఆ దుష్టునికే చెందును?
Ⓐ మూర్ఖత్వము
Ⓑ దుష్టత్వము
Ⓒ మూఢత్వము
Ⓓ గర్వాంధము
② దుష్టులు మరణము నొందుటచేత నాకు ఏమి కలుగునా? అని యెహోవా అనెను?
Ⓐ సంతోషము
Ⓑ ఆనందము
Ⓒ ఉత్సాహము
Ⓓ ఉల్లాసము
③ దుష్టుడు జరిగించు వేటిని నీతిపరుడు చేసిన యెడల అతడు బ్రదుకునా? అని యెహోవా అనెను?
Ⓐ చెడ్డకార్యములు
Ⓑ హేయక్రియలు
Ⓒ హేయ క్రియలు
Ⓓ పాపకార్యములు
4 దుష్టుడు తన దుష్టత్వమునుండి మరలి ఏమి జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును?
Ⓐ సత్యధర్మములు
Ⓑ మంచికార్యములు
Ⓒ నీతిన్యాయములు
Ⓓ గొప్పకార్యములు
⑤ యెహోవా కట్టడలను అనుసరించి దుష్టుడు నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతడు చేసిన ఏమి జ్ఞాపకములోనికి రావు?
Ⓐ పాపకృత్యములు
Ⓑ దోషకార్యములు
Ⓒ చెడుపనులు
Ⓓ అపరాధములు
⑥ దుష్టుడు యెహోవా కట్టడలను అనుసరించినందున అతడు దేనిని బట్టి బ్రదుకును?
Ⓐ నీతిని
Ⓑ సత్యమును
Ⓒ మార్పును
Ⓓ ప్రవర్తనను
⑦ దుష్టుడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన వేటిని చేయక మానెను?
Ⓐ వ్యర్ధక్రియలన్నిటిని
Ⓑ అతిక్రమక్రియలన్నిటిని
Ⓒ దుర్మార్గక్రియలన్నిటిని
Ⓓ దోషక్రియలన్నిటిని
⑧ దుష్టులు గర్వించి దీనుని ఎలా తరుముచుండెను?
Ⓐ వెంటాడి
Ⓑ వేగముగా
Ⓒ వడిగా
Ⓓ పరుగెత్తించి
⑨ దుష్టులు దేవుడు లేడని ఏమి చేయుదురు?
Ⓐ ఆలోచించుదురు
Ⓑ తలంచుదురు
Ⓒ మాట్లాడుదురు
Ⓓ యోచించుదురు
①⓪. దుష్టులు ఏమి మానుకొని ప్రవర్తింతురు?
Ⓐ భయము
Ⓑ భీతి
Ⓒ సత్యము
Ⓓ నీతి
①①. యెహోవా యొక్క ఏమి ఉన్నతమైనవై దుష్టుల దృష్టికి అందకయుండును?
Ⓐ ఉపదేశములు
Ⓑ న్యాయవిధులు
Ⓒ కట్టడలు
Ⓓ మార్గములు
①② దుష్టులు తరతరములకు ఏమి చూడమని తమ హృదయములో అనుకొందురు?
Ⓐ కీడు
Ⓑ అపాయము
Ⓒ ఆపద
Ⓓ నష్టము
①③ దుష్టులు చాటైన స్థలములలో ఎవరిని చంపుదురు?
Ⓐ దీనులను
Ⓑ మంచివారిని
Ⓒ ఉన్నతులను
Ⓓ నిరపరాధులను
①④ దుష్టుల యొక్క ఏమి విరుగగొట్టుమని కీర్తనాకారుడు యెహోవాతో అనెను?
Ⓐ దవడను
Ⓑ పండ్లను
Ⓒ భుజమును
Ⓓ చేతులను
①⑤ దుష్టులు ఎక్కడికి దిగిపోవుదురు?
Ⓐ నరకమునకు
Ⓑ పాతాళమునకు
Ⓒ చీకటిబిలముకు
Ⓓ అంధకారలోయకు
Result: