1. యెహోవాయే నిజమైన దేవుడు అని ఎవరు అనెను?
2. ఎప్పటి వరకు యెహోవాయే రాజు అని యిర్మీయా అనెను?
3. యెహోవా తన యొక్క దేని చేత భూమిని సృష్టించెనని యిర్మీయా అనెను?
4. యెహోవా తన జ్ఞానము చేత దేనిని స్థాపించెను?
5. యెహోవా తన యొక్క దేనిచేత ఆకాశమును విశాలపరచెను?
6. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా ఏవి ఆకాశమండలములో పుట్టును?
7. భూమ్యాంతభాగములలో నుండి యెహోవా ఏమి ఎక్కజేయును?
8. వర్షము కలుగునట్లుగా యెహోవా ఏమి పుట్టించును?
9. యెహోవా తన యొక్క వేటి నుండి గాలి రావించును?
10. యెహోవా యొక్క దేనికి భూమి కంపించును?
11. జనముల యొక్క ఎవరందరిలో యెహోవా వంటివారెవరును లేరని యిర్మీయా అనెను?
12. జనములు యెహోవా యొక్క దేనిని సహింపలేవు?
13. నరులు యెహోవాకు భయపడుట ఏమై యున్నది?
14. యెహోవా యొక్క దేనిని బట్టి ఆయన నామము ఘనమైనదని యిర్మీయా అనెను?
15. సమస్తమును నిర్మించిన యెహోవాకు ఇశ్రాయేలు ఎలా యున్న గోత్రము?
Result: