1. అజ్ఞానముగా మాటలాడు ఎవరి నోరు మూయుట "దేవుని చిత్తము"?
2. దేనికి దూరముగా నుండుటయే "దేవుని చిత్తము"?
3. "దేవుడు తన చిత్తప్రకారమైన" దేనిని బట్టి మనలను ముందుగా నిర్ణయించెను?
4. "దేవుని చిత్తమును"పూర్ణముగా గ్రహించిన సంఘము ఏది?
5. "దేవుని చిత్తమలాగు"నున్న యెడల మేలు చేసి శ్రమపడుట ఎట్టిది?
6. "దేవుని చిత్తప్రకారము" ప్రస్తుతపు దేనిలో నుండి మనలను విమోచించుటకు క్రీస్తు తన్నుతాను ఆప్పగించుకొనెను?
7. "దేవుని చిత్తము" వలన తమ సామర్థ్యము కంటే ఎక్కువగా చేసిన సంఘము ఏది?
8. "దేవుని చిత్తప్రకారము" బాధపడువారు ఏమి గలవారై నమ్మకముతో సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనుచున్నారు?
9. ఎవరి యొద్దకు వెళ్ళుటకు "దేవుని చిత్తము" వలన వీలు కలుగునట్లు తన ప్రార్ధనల యందు పౌలు దేవుని బతిమాలుచుండెను?
10. లోకమును దాని యొక్క ఆశయు గతించిపోయినను గాని "దేవుని చిత్తప్రకారము" జరిగించువాడు ఎప్పటి వరకు నిలుచును?
11. "దేవుని చిత్తానుసారముగా" మనమేది అడిగినను మన మనవి ఆయన ఆలకించును అనునది మనకు కలిగిన ఏమిటి?
12. ఏమి చెల్లించుట యేసుక్రీస్తు నందు మన విషయములో "దేవుని చిత్తము"?
13. ప్రతి విషయములో "దేవుని చిత్తము" గూర్చి ఏమి నిశ్చయత గలవారమై నిలకడగా నుండవలెను?
14. తండ్రి యైన "దేవుని చిత్తము"నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు ఎవరికి ఆహారమై యున్నది?
15. దేవుడైన యెహోవా తన "చిత్తానుసారమైన" మనస్సుగల ఎవరిని కనుగొనియుండెను?
Result: