1. ద్రవ్యము అనగా నేమి?
2. యెహోవా గుడారములో అతిధిగా ఉండదగినవాడు తన ద్రవ్యమును దేనికివ్వడు?
3. ఏమి యైన భార్య తాను కూడబెట్టిన ద్రవ్యముతో ద్రాక్షాతోట నాటించును?
4. ద్రవ్యము అందరికి ఎలా వచ్చును?
5. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చెదనని ఎవరితో అనకూడదు?
6. ద్రవ్యమును ఆపేక్షించువారు ద్రవ్యము చేత ఏమి నొందరు?
7. ద్రవ్యమును వస్త్రములను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని ఎలీషా ఎవరిని అడిగెను?
8. సూర్యుని క్రింద బ్రదుకువాని ద్రవ్యము వానికి ఎలా యుండును?
9. ద్రవ్యమిచ్చి పరిశుద్ధాత్మను సంపాదించవలెనని ఎవరు అనుకొనెను?
10. ప్రధానయాజకులు ఎవరికి ద్రవ్యమిచ్చి యేసు దేహమును ఆయన శిష్యులు ఎత్తుకెళ్ళిరని చెప్పమనెను?
11. దేవుని మందిరము బాగుచేయుటకు ప్రధానయాజకుడైన ఎవరికి ద్రవ్యమును అప్పగించిరి?
12. ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని సహాయము చేయలేని జనము యొద్దకు పోవునదెవరు?
13. ద్రవ్యమిచ్చి నీళ్ళు త్రాగితిమని ఎవరు యెహోవాతో అనెను?
14. ఏ సంఘము ఇచ్చిన ఉపకార ద్రవ్యము విషయమై ప్రసిద్ధి చెందిన సహోదరుని పౌలు ఏర్పర్చెను?
15. ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందుననుకొనిన గారడీ సీమోను యొక్క వెండి ఏమగునని పేతురు అనెను?
Result: