Bible Quiz in Telugu Topic wise: 426 || తెలుగు బైబుల్ క్విజ్ ("ద్రాక్ష" అనే అంశముపై క్విజ్)

1. పరిశుద్ధగ్రంధములో ద్రాక్షాచెట్టు వేటికి సాదృశ్యము?
ⓐ ఐశ్వర్యము
ⓑ శ్రేయస్సు
ⓒ సారవంతము
ⓓ పైవన్నియు
2. ద్రాక్షా పండ్ల యడల వలన ఏమి వచ్చును?
ⓐ నెమ్మది
ⓑ ఆదరణ
ⓒ బలము
ⓓ శాంతి
3. తన కొరకు ద్రాక్షాతోటలను నాటించుకున్నది ఎవరు?
ⓐ దావీదు
ⓑ సొలొమోను
ⓒ ఉజ్జీయా
ⓓ ఆసా
4. ఎవరు సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షాతోట?
ⓐయూదావంశము
ⓑ అష్షూరువంశము,
ⓒ ఇశ్రాయేలువంశము
ⓓ ఎదోమువంశము
5. సీయోను పర్వతముమీద ఎటువంటి ద్రాక్షారసముతో యెహోవా విందుచేయును?
ⓐ తీయనైన
ⓑమడ్డిమీది నిర్మలమైన
ⓒ త్రొక్కినదైన
ⓓ గానుగలో ఆడించిన
6. ఎక్కడ నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును?
ⓐ భూమిలో నుండి
ⓑ జలధారలనుండి
ⓒ పర్వతములనుండి
ⓓ వృక్షములనుండి
7. దేవుని ప్రజలు ద్రాక్షాచెట్టు వలె ఏమౌదురు?
ⓐ వికసి౦తురు
ⓑ వ్యాపించుదురు
ⓒ ఫలించుదురు
ⓓ పుష్పి౦తురు
8. ద్రాక్షా గానుగను త్రొక్కునట్లు దేవుడు ఏ దేశమును త్రొకును?
ⓐ తూరును
ⓑ మోయాబును
ⓒ ఎదోమును
ⓓ నోదును
9. ఎవరు ద్రాక్షాకాయలు తింటే పిల్లల పళ్ళుపులియునని; ఏ దేశ సామెత?
ⓐ తండ్రులు - ఇశ్రాయేలు
ⓑ తల్లులు - యూదా
ⓒ అన్నలు - సీదోను
ⓓ బంధువులు - సిరియ
10. ద్రాక్షారసములో ఎవరు తన బట్టలు ఉదుకును?
ⓐ యోసేపు
ⓑ ఎఫ్రాయీము
ⓒ యూదా
ⓓ అహరోను
11. ద్రాక్షారసము యేసుక్రీస్తు యొక్క దేనికి సాదృశ్యము?
ⓐ శరీరమునకు
ⓑ రక్తమునకు
ⓒ సిలువకు
ⓓ ప్రార్ధనకు
12. ఎటువంటి మనస్సుతో ద్రాక్షారసము త్రాగాలి?
ⓐ సంతోషకరమైన
ⓑ ఆనందకరమైన
ⓒ ఉల్లాసపు
ⓓ ఉత్సాహకరమైన
13. ఏమి పొందునంతగా దేవుడు ద్రాక్షారసమును పంపించును?
ⓐ ఆనందము
ⓑ తృప్తి
ⓒ స్వాంతన
ⓓ ఉత్సాహము
14. యేసుక్రీస్తుతో పాటు ద్రాక్షారసమును క్రొత్తదిగా ఎక్కడ త్రాగుదుము?
ⓐ ఒలీవల కొండపై
ⓑ భూలోకములో
ⓒ దేవుని రాజ్యములో
ⓓ మందిరములో
15. ద్రాక్షాతోట వ్యవసాయకుడు ఎవరు?
ⓐ తండ్రియైన యెహోవా
ⓑ శ్రీ యేసుక్రీస్తు
ⓒ ప్రధానదూతలు
ⓓ మహాదూతలు
Result: