1. యెహోవా దినమున యెహోవా ఎవరిని సముద్ర "ద్వీపముల" నుండి విడిపించును?
2. తన యెదుట ఎలా యుండుమని యెహోవా "ద్వీపములతో" చెప్పెను?
3. ఏమి తీర్చుకొనుటకు తమ్మును పిలిచిన యెహోవాను "ద్వీపములు"చూచి దిగులుపడుచున్నవి?
4. యెహోవాకు క్రొత్తగీతము పాడుమని "ద్వీపములతో" ఎవరు చెప్పెను?
5. ఎవరి "ద్వీపములకు" పోయి చూడుమని యెహోవా ఇశ్రాయేలు యింటివారితో సెలవిచ్చెను?
6. యెహోవా మాటవిని దానిని దూరమైన "ద్వీపములలోని"వారికి ప్రకటించుమని ఎవరితో ఆయన చెప్పెను?
7. దేనిలో జరుగు గొప్పవధయు విని "ద్వీపములు"కంపించును?
8. అనేక "ద్వీపములకు" ప్రయాణము చేయు ఎవరికి యెహోవా సెలవిచ్చెను?
9. ఎవరు "ద్వీపముల" జనముల తట్టుకు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును?
10. "ద్వీపములు" యెహోవా యెదుట గాలికి ఎగురు దేని వలె నున్నవి?
11. "ద్వీపములలో" ఎలా నివసించువారి మీదకి అగ్ని పంపెదనని యెహోవా అనెను?
12. సముద్రములో గాలి వీచి తుఫాను రాగా వారు ఓడను ఏ "ద్వీపమునకు" నడిపించిరి?
13. సముద్రతుఫాను నుండి తప్పించుకొని ఓడలోని వారుపౌలుతో పాటు చేరిన "ద్వీపము"ఏమని తెలుసుకొనిరి?
14. ఏ "ద్వీపమున" యోహాను పరవాసిగా నుండెను?
15. "ద్వీపవాసులు" యెహోవా తట్టు చూచి ఏమి గలవారగుదురు?
Result: