1. ఇష్మాయేలు నివాసము చేసిన "అరణ్యము" పేరేమిటి?
2. మోషే ఏ అరణ్యము అవతల మందను తోలుకొని పోయెను?
3. ఇశ్రాయేలీయులు మూడు దినములు ఏ అరణ్యములో యుండెను?
4. ఏ అరణ్యములో నున్నప్పుడు ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల మీద సణిగిరి?
5. సమ్సోను ఏ అరణ్యములో నుండి వచ్చిన కొదమసింహమును చంపెను?
6. సౌలుకు భయపడి ఏ అరణ్యమందున్న ఒక పర్వతముపై దావీదు నివసించెను?
7. ప్రవక్తయగు గాడు చెప్పినట్టు దావీదు ఏ అరణ్యములోనికి చొచ్చెను?
8. సొలొమోను దేవుని మందిరమునకు మ్రానులు ఏ అరణ్యము నుండి తెప్పించెను?
9. సొలొమోను ఏ అరణ్యములో పట్టణములను కట్టించెను?
10. ఏ అరణ్యమార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా మోషేతో మోయాబీయులను బాధింపవద్దనెను?
11. మోషే ఏ అరణ్యములో నుండి హెప్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపెను?
12. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఉత్తరదిక్కున సరిహద్దు నుండి ఏ అరణ్యము వరకు సాగెను?
13. ఏ అరణ్యములో ఉజ్జీయా దుర్గములు కట్టించి బావులు త్రవ్వించెను?
14. అరణ్యములో ఏమి దొరికినట్లు ఇశ్రాయేలీయులు యెహోవాకు దొరికిరి?
15. అరణ్యములో ఎవరికి మార్గము సిద్ధపరచవలెను?
Result: