1. ఎవరు పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొనెను?
2. ఏమి ధరించు కొందుమా అని మీ దేహమును గూర్చి ఏమి చేయవద్దని యేసు చెప్పెను?
3. వేటిని దేవుడు మనకు ధరింపజేసియున్నాడు?
4. సీయోనుకుమార్తెలు కిరీటము ధరించిన ఎవరిని చూచుచుండెను?
5. యోబు వస్త్రము వలె దేనిని ధరించుకొనగా, అది యోబును ధరించెను?
6. వేటిని కంఠభూషణముగా ధరించుకోవాలి?
7. సాతాను ఎవరి వేషము ధరించుకొనియున్నది?
8. ఏమి ధరించుకొని యున్న స్త్రీ యొక్క పాదముల క్రింద చంద్రుడు, నక్షత్రములు యుండెను?
9. ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రమును ధరించుకొని మనము ఏమి చేయాలి?
10. యధార్ధమార్గమున నడిపించుచు దేవుడు మనకు ఏమి ధరింపజేయును?
11. అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు దేనిని ధరించుకోవాలి?
12. ప్రాచీనస్వభావమును పరిత్యజించి, ఎవరి పోలిక చొప్పున నవీనస్వభావము ధరించుకొని యున్నాము?
13. పగటివారమైన మనము మత్తులమై యుండక, ఏ కవచమును,ఏ శిరస్త్రాణమును ధరించుకొందము?
14. మన కొరకు మరణము పొందిన యేసును వేటితో కిరీటము ధరించుకొనిన వానిగా చూచుచున్నాము?
15. ఏమి ధరించుకొనిన బలిష్టుడైన దూత పరలోకము నుండి దిగివచ్చెను?
Result: