1. ఎక్కడ యున్న జనములను పిలుచుటకు యెహోవా "ధ్వజము"నెత్తును?
2. ఇశ్రాయేలీయులు తమ తమ పితరుల కుటుంబముల ఏమి పట్టుకొని తమ తమ "ధ్వజముల"నొద్ద దిగవలెను?
3. ప్రత్యక్ష గుడారములో యెహోవా యొక్క ఎవరు విజయ"ధ్వజములను "తమ "ధ్వజములుగా" వారెత్తుదురు?
4. యెహోవా యందు ఏమిగల వారికి ఆయన ఒక "ధ్వజము"నిచ్చియుండెను?
5. యెహోవా దినమున ప్రజలకు "ధ్వజముగా"నిలుచుచుండు ఎవరి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును?
6. ఎవరిని పిలుచుటకు యెహోవా యొక "ధ్వజము"నిలువబెట్టును?
7. వేటి మీద ఒకడు "ధ్వజమెత్తినపుడు" లోకనివాసులను చూడుమని యెహోవా చెప్పెను?
8. ఎవరి అధిపతులు "ధ్వజమును"చూచి భీతినొందుదురని యెహోవా సెలవిచ్చియుండెను?
9. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు ఏమి లేని కొండ మీద "ధ్వజమును"నిలువబెట్టుమని యెహోవా సెలవిచ్చెను?
10. జనములు చూచునట్లు యెహోవా ఎవరిని "ధ్వజమెత్తమనెను"?
11. సీయోను చూచునట్లు "ధ్వజమెత్తుడి" అని యెహోవా ఏ నివాసులతో సెలవిచ్చెను?
12. నేను ఎన్నాళ్ళు "ధ్వజము" చూచుచుండవలెనని ఎవరు అనెను?
13. "ధ్వజము" నెత్తి మరుగు చేయక దేనిని చాటించుమని యెహోవా సెలవిచ్చెను?
14. ఎవరి ప్రాకారముల మీద పడుటకై "ధ్వజము"నిలువబెట్టుడని యెహోవా సెలవిచ్చెను?
15. ప్రియుడైన క్రీస్తు దేనిని సంఘము మీద "ధ్వజముగా" ఎత్తెను?
Result: