1. నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
2. సంసోను ఎన్ని వందల "నక్కలను" పట్టుకొని వాటి తోకలకు దివిటీలు కట్టెను?
3. దివిటీలో అగ్ని మండజేసి సమ్సోను "నక్కలను" ఎవరి చేలలోనికి వాటిని పోనిచ్చెను?
4. యూదులు కట్టుచున్న యెరూషలేము రాతి గోడ మీద ఒక "నక్క "యెగిరినట్టయిన అది పడిపోవునని ఎవరు అనెను?
5. "నక్కలైనను" చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును,నా జనుల కుమారి యెడారిలోని దేని వలె క్రూరురాలాయెనని యెహోవా అనెను?
6. ఇశ్రాయేలీయుల యొక్క ఎవరు పాడైన స్థలములలో నుండు "నక్కలతో" సాటిగా ఉన్నారని యెహోవా అనెను?
7. ప్రభువు పలికిన సాక్ష్యము వినిన ఎవరు "నక్కలు" అరుచునట్లు అరచుచుండెను?
8. నా ప్రాణమును నశింపజేయవలెనని వెదకువారు "నక్కల" పాలగుదురని ఎవరు అనెను?
9. వేటిని చెరుపు "నక్కలను" పట్టుకొనుమని షూలమ్మితీ అనెను?
10. ఏమి చేసి "గుంట నక్కలను" పట్టుకొనుమని షూలమ్మితీ అనెను?
11. "నక్కలకు" బొరియలు ఉన్నవి గాని ఎవరు తలవాల్చుటకైనను స్థలము లేదని యేసు చెప్పెను?
12. యేసు ఎవరిని "నక్క" అని అనెను?
13. ఏ నగరులో అడవిపిల్లులును "నక్కలును" కలిసికొనును?
14. యెహోవా ప్రతిదండన చేయు దినమున "నక్కలు" పండుకొనిన వాటి ఎక్కడ జమ్ము తుంగగడ్డి మేతయు పుట్టును?
15. పరిశుద్ధములో "నక్క" దేనికి సూచనగా నుండెను?
Result: