Bible Quiz in Telugu Topic wise: 44 || తెలుగు బైబుల్ క్విజ్ ("International Day of Happiness" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "Happiness" అనగా నేమి?
ⓐ ఆనందము
ⓑ సంతోషము
ⓒ ఉత్సాహము
ⓓ పైవన్నియు
2. యెహోవా యొక్క దేనియందు ఆనందించవలెను?
ⓐ కట్టడ
ⓑ నియమము
ⓒ ధర్మశాస్త్రము
ⓓ సంకల్పము
3. ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించమని పౌలు ఏ సంఘమునకు వ్రాసెను?
ⓐ గలతీ
ⓑ కొరింథీ
ⓒ కొలస్సీ
ⓓ ఫిలిప్పీ
4. ఏమైన తన కుమారుడు తిరిగి దొరికెనని తండ్రి సంతోషించి ఆనందించెను?
ⓐ పారిపోయిన
ⓑ తప్పిపోయిన
ⓒ దాగుకొనిన
ⓓ తొలగిపోయిన
5. యెహోవాను బట్టి సంతోషించిన యెడల ఆయన మన యొక్క ఏమి తీర్చును?
ⓐ ఆశలను
ⓑ కోరికలను
ⓒ హృదయవాంఛలను
ⓓ మనవులను
6. సంతోషహృదయము దేనికి తేట నిచ్చును?
ⓐ కన్నులకు
ⓑ ముఖమునకు
ⓒ ప్రాణమునకు
ⓓ మనస్సునకు
7. యెహోవా ఏమి చేసిన వారి తలల మీద నిత్యసంతోషము ఉండును?
ⓐ విడిపించిన
ⓑ కాపాడిన
ⓒ విమోచించిన
ⓓ నడిపించిన
8. మన కష్టార్జితమందు సంతోషించుట దేవుని యొక్క దేని వలన కలిగినదనుకొనవలెను?
ⓐ ప్రేమ
ⓑ కరుణ
ⓒ దీవెన
ⓓ ఆశీర్వాదము
9. ఏమి విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటకోసెదరు?
ⓐ కన్నీళ్ళు
ⓑ మన్ను
ⓒ మందులు
ⓓ స్వేదబిందువులు
10. యెహోవా ఏలుచున్నాడని ఏది ఆనందించును, ఏది సంతోషించును?
ⓐ కొండ - వాయువు
ⓑ పర్వతము - గుట్ట
ⓒ ఆకాశము - భూమి
ⓓ వర్షము - హిమము
11. దేనికి బదులుగా సంతోషమిచ్చి యెహోవా మనలను ఆదరించును?
ⓐ వేదనకు
ⓑ బాధకు
ⓒ రోదనకు
ⓓ దుఃఖముకు
12. క్రీస్తు యొక్క దేనిలో పాలివారై యున్నంతగా సంతోషపడవలెను?
ⓐ నిందలలో
ⓑ ప్రార్ధనలో
ⓒ శ్రమలలో
ⓓ శోధనలలో
13. ఎవరు తమ యొక్క ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుట యెహోవాకు సంతోషము?
ⓐ నీతిమంతులు
ⓑ దుష్టులు
ⓒ చెడినవారు
ⓓ పడినవారు
14. ఏది పరిశుధ్ధాత్మ యందలి ఆనందమునై యున్నది?
ⓐ ఆజ్ఞ
ⓑ వాగ్ధానము
ⓒ దేవునిరాజ్యము
ⓓ నిబంధన
15. మన యొక్క ఏమి విడిపించి దేవుడు సంతోషవస్త్రమును ధరింపజేసియున్నాడు?
ⓐ బంధకములు
ⓑ సంకెళ్ళు
ⓒ ముసుగు
ⓓ గోనెపట్ట
Result: