Bible Quiz in Telugu Topic wise: 441 || తెలుగు బైబుల్ క్విజ్ ("నక్షత్రము" అనే అంశము పై క్విజ్-3)

1. ఆకాశవిశాలమునకు రెండు గొప్ప జ్యోతులతో పాటు దేవుడు వేటిని సృజించెను?
ⓐ నక్షత్రములను
ⓑ పురుగులను
ⓒ చెట్లను
ⓓ పువ్వులను
2. దేవుడు ఆకాశమందు వేటిని నియమించెను?
ⓐ నక్షత్రములను
ⓑ నక్షత్రముల సంఖ్యను
ⓒఉల్కలను
ⓓ చుక్కలను
3. స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనునవి ఏమిటి?
ⓐ నక్షత్రమండలములు
ⓑ ఉపనక్షత్రములు
ⓒ నక్షత్రరాసులు
ⓓ నక్షత్రముల పేరులు
4. నక్షత్రము ఎవరిలో ఉదయించును?
ⓐ యోసేపులో
ⓑ దావీదులో
ⓒ యోబులో
ⓓ యాకోబులో
5. కృత్తిక నక్షత్రములను యెహోవా ఏమి చేయగలడు?
ⓐ వదులును
ⓑ బంధించును
ⓒ త్రోయును
ⓓ కట్టును
6. నక్షత్రములు ఆకాశము నుండి ఏమి చేసెను?
ⓐ మెరిసెను
ⓑ దిగెను
ⓒ యుద్ధము
ⓓ పడెను
7. వేటిని యెహోవా నడిపించును?
ⓐ మేఘములను
ⓑ మంచుకణములను
ⓒ వాయువులను
ⓓ సప్తర్షీనక్షత్రములను
8. నక్షత్రములకు యెహోవా ఏమి పెట్టును?
ⓐ ఆహారము
ⓑ నీరు
ⓒ పేరులు
ⓓ రంగులు
9. ఏవి యేకముగా కూడి యెహోవాకు పాడును?
ⓐ శ్రీ పుష్పములు
ⓑ పక్షులు
ⓒ పర్వతములు
ⓓ ఉదయనక్షత్రములు
10. ఏ నక్షత్రములను దేవుడు విప్పును?
ⓐ కృత్తిక
ⓑ స్వాతి
ⓒ మృగశీర్ష
ⓓ సప్తర్షి
11. దేవుని వైపు అనేకులను ఎవరైతే త్రిప్పుతారో వారు నక్షత్రములవలె ఎలా ప్రకాశించెదరు?
ⓐ ఎప్పుడూ
ⓑ నిరంతరము
ⓒ కొంతకాలము
ⓓ కొన్ని దినములు
12. నక్షత్రములను దేవుడు ఏమి చేయును?
ⓐ మేఘములో ఉంచును
ⓑ జలములో ఉంచును
ⓒ మరుగుపరచును
ⓓ వాయువులో పెటును
13. ఏ నక్షత్రములు యెహోవాను స్తుతించెను?
ⓐ కదిలే
ⓑ పరుగెట్టే
ⓒ మరుగునున్న
ⓓ కాంతిగల
14. ఏ దిక్కున ఉన్న నక్షత్రమును చూచి జ్ఞానులు బాలుడైన యేసును చూచుటకు వచ్చెను?
ⓐ దక్షిణ
ⓑ పడమర
ⓒ తూర్పు
ⓓ ఉత్తర
15. ఏమి కుడిచేత పట్టుకొని యేసు ఏడు దీపస్థంభముల మధ్య సంచరించుచుండెను?
ⓐ ఏడు నక్షత్రములు
ⓑ ఏడు దీపములు
ⓒ ఏడు స్తంభములు
ⓓ ఏడు జ్యోతులు
Result: