Bible Quiz in Telugu Topic wise: 443 || తెలుగు బైబుల్ క్విజ్ ("నడికట్టు" అనే అంశము పై క్విజ్)

1. "నడికట్టు" ఆనగా ఏమిటి?
ⓐ నడుము కట్టు
ⓑ తలకట్టు
ⓒ మెడకట్టు
ⓓ పాదముల కట్టు
2. యెహోవాకు ఏమి కలుగుటకై యూదా ఇశ్రాయేలు వంశస్థులను "నడికట్టు" నరుని నడుముకు అంటియున్నరీతిగా ఆయనను అంటియుండజేసెను?
ⓐ కీర్తి స్తోత్ర మహిమలు
ⓑ ప్రభావ ఘనతలు
ⓒ నమస్కారములు
ⓓ వందన ప్రణామములు
3. ఎక్కడ నుండి యెహోవా ఈల వేసి పిలిచిన జనుల "నడికట్టు" విడిపోదు?
ⓐ నలుదిక్కుల నుండి
ⓑ తూర్పు నుండి
ⓒ భూమ్యాంతముల నుండి
ⓓ భూదిగంతముల నుండి
4. అవిసెనార "నడికట్టును" తన నడుముకు కట్టుకొనుమని యెహోవా ఎవరికి చెప్పెను?
ⓐ యెషయాకు
ⓑ ఆమోసుకు
ⓒ జెఫన్యాకు
ⓓ యిర్మీయా
5. విచిత్రమైన "నడికట్టు" యెహోవా ఎవరికి కట్టమనెను?
ⓐ అధిపతులకు
ⓑ రాజులకు
ⓒ యాజకులకు
ⓓ పెద్దలకు
6. ఎవరు తన "నడికట్టును" దావీదునకు ఇచ్చెను?
ⓐ హూపై
ⓑ యోనాతాను
ⓒ అహీతోపెలు
ⓓ అహీమెలెకు
7. ఎవరికి శాపము నిత్యము కట్టుకొను "నడికట్టు" వలె నుండును?
ⓐ భక్తిహీనునికి
ⓑ అవివేకికి
ⓒ అజ్ఞానికి
ⓓ మూర్ఖునికి
8. గర్విష్టురాండ్రైన ఎవరి "నడికట్టుకు" ప్రతిగా త్రాడు ఉండును?
ⓐ మోయాబు కుమార్తెలు
ⓑ సీయోను కుమార్తెలు
ⓒ తూరు కుమార్తెలు
ⓓ ఎదోము కుమార్తెలు
9. గృహనిర్వహకుడైన షెబ్నా "నడికట్టును" తీసి ఎవరికి ఇచ్చి వాని బలపరచెదనని యెహోవా అనెను?
ⓐ అబ్యాతారునకు
ⓑ అహీయాకు
ⓒ యెహూనకు
ⓓ ఎల్యాకీమునకు
10. సమాధానకాల మందు రక్తము చిందించి దానిని తన "నడికట్టుపై"పడవేసుకొన్నదెవరు?
ⓐ అబ్నేరు
ⓑ అబీషై
ⓒ యోవాబు
ⓓ అమాశా
11. యెష్షయి మొద్దు నుండి పుట్టు చిగురునకు ఏమి "నడికట్టుగా"ఉండును?
ⓐ ప్రేమ
ⓑ సత్యము
ⓒ దయ
ⓓ కటాక్షము
12. ఎవరి "నడికట్టును" రోగులకు తగిలించినపుడు వారికి స్వస్థత కలిగెను?
ⓐ పౌలు
ⓑ పేతురు
ⓒ యోహాను
ⓓ యాకోబు
13. "కట్టు"చేత నడుమును బలపరచుకొనిన స్త్రీ ఎవరు?
ⓐ సుబుద్ధి
ⓑ గుణవతి
ⓒ యోగ్యురాలు
ⓓ వివేకి
14. తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ప్రజలు ఎక్కడ పాతిపెట్టబడి చెడిపోయి పనికిరాని "నడికట్టు"వలె యుందురని యెహోవా అనెను?
ⓐ హిద్దెకెలు
ⓑ ఫరాతు
ⓒ యూఫ్రటీస్
ⓓ యొర్దాను
15. "నడికట్టు" దేనికి సూచనగా యుండెను?
ⓐ వేగమునకు
ⓑ వడికి
ⓒ పనికి
ⓓ బలమునకు
Result: