1 ప్ర. దేవుని యందు భయభక్తులు గల ఎవరు "నమ్మకమైన"మనుష్యుడు అని నెహెమ్యా అనెను?
2. యెహోవా యందు "నమ్మికయుంచువారిని ఏమి ఆవరించుచున్నది?
3 ప్ర.యెహోవా యందు "నమ్మికయుంచువారు ధన్యులు అని ఎవరు అనెను?
4 ప్ర. యెహోవా యందు "నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు దేని వలె నుందురు?
5 ప్ర. ఎలా యెహోవా యందు "నమ్మకముంచ"వలెను?
6"నమ్మకమైన "ఏమి గలవాడు సంగతి దాచును?
7 ప్ర. "నమ్మకమైన"ఎవరు ఔషధము వంటివాడు?
8 . మోషే ఏమియై యుండి దేవుని యిల్లంతటిలో "నమ్మకము"గా ఉండెను?
9 ప్ర. మరణము వరకు "నమ్మకముగా" యుండిన యెడల దేవుడు ఏమి ఇచ్చును?
10 ప్ర. దాసులైన వారు ఎటువంటి మంచి "నమ్మకము"కనుపరచునట్లు వారిని హెచ్చరించుమని పౌలు తీతుకు వ్రాసెను?
11. ఏమి చేయు స్త్రీలు అన్ని విషయములలో "నమ్మకమైన"వారునై యుండవలెను?
12 . అన్యాయపు సిరి విషయములో "నమ్మకముగా" ఉండని యెడల దేనిని మీ వశము చేయును అని యేసు అనెను?
13ప్ర. ఏమి పట్టినవాని తండ్రి, నాకు అప"నమ్మకముండకుండ"సహాయము చేయుమని యేసుతో అనెను?
14. సమస్తమును ఎలా చేయుచున్నానని చెప్పిన దేవుని మాటలు "నమ్మకము"ను నిజమునై యున్నవి?
15ప్ర. క్రీస్తు ఏమై యుండి దేవుని యింటి మీద "నమ్మకముగా"ఉండెను?
Result: