1. "Laugh"అనగా అర్ధము ఏమిటి?
2. "నవ్వు"టకు ఏమి కలదని ప్రసంగి చెప్పెను?
3. ఏది వడిగా పోవుచుండు ఈటెను చూచి "నవ్వును"?
4. ఎవరి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచి వారి గురించి "నవ్వు"చుండును?
5. యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడిం ఎవరిని చూచి యెహోవా "నవ్వు" చుండెను?
6. నా మీదికి వచ్చు శత్రువులను చూచి నీవు "నవ్వు"దువని ఎవరు యెహోవాతో అనెను?
7. యెహోవా నీకు నోటి నిండా " నవ్వు" కలుగజేయునని ఎవరు యోబుతో అనెను?
8. ఎవరు "నవ్వు"లాటలు పుట్టించుటకు విందు చేయును?
9. యెహోవా గద్దింపునకు లోబడని వారికి ఏమి వచ్చినపుడు ఆయన "నవ్వెద"ననెను?
10. మనుష్యులు ఎలా యుండగా నేను వారిని దయగా చూచి చిరు" నవ్వు" నవ్వితినని యోబు అనెను?
11. దేవుని తమకు దుర్గముగా చేసికొనక తమ చేటును బలపరచుకొనిన వారిని చూచి ఎవరు "నవ్వె"దరు?
12. ఒకడు "నవ్వు" చుండినను వాని యొక్క ఎక్కడ దుఃఖముండవచ్చును?
13. "నవ్వుతూ" తన హృదయమును వెర్రిదానవని ఎవరు అనెను?
14. "నవ్వు" కంటే ఏమి చేయుట మేలు అని ప్రసంగి అనెను?
15. ఎక్కడికి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించునప్పుడు మన నోటి నిండా "నవ్వుండెను"?
Result: