1. అన్యరాజునైన నన్ను దేవుడు తన సేవకుడనని పిలిచెను; నా పేరేమిటి?
2. అన్యరాజునైన నన్ను దేవుడు తన మందిరపని నిమిత్తము ఏర్పర్చుకొనెను; నా పేరేమిటి?
3. అన్యరాజునైన నన్ను తన మందిరపని నిమిత్తము తాకీదు ఇచ్చుటకు దేవుడు ఏర్పర్చుకొనెను; నా పేరేమిటి?
4. అన్యరాజునైన నన్ను తనప్రజలైన యూదులను రక్షించుటకు దేవుడు నియమించెను; నా పేరేమిటి?
5. అన్యరాజునైన నన్ను దేవుని మందిర నిర్మాణమునకు నెహెమ్యాను పంపుటకు దేవుడు అనుమతినిచ్చాడు; నాపేరేమిటి?
6. అన్యరాజునైన నేను దేవుని మందిర ఉపకరణములను వాడుకొని నశించిపోయాను; నాపేరేమిటి?
7. అన్యరాజునైన నన్ను దేవుడు తన బలమును,తన మహిమను కనుపరచుకొనుటకు నియమించెను; నా పేరేమిటి?
8. అన్యరాజునైన నేను దావీదును నా రాజ్యములో చేర్చుకొంటిని: నాపేరేమిటి?
9. అన్యరాజునైన నా నోట యెహోవా మాటగా యోషీయా రాజుకు దేవుడు పలికించెను; నా పేరేమిటి?
10. అన్యరాజునైన నా చేతికి యెహోవాకు విరోధముగా పాపము చేసిన మనషేను దేవుడు అప్పగించేను; నా పేరేమిటి?
11. అన్యరాజునైన నా చేతికి యెహోవా దృష్టికి దోషులైన ఇశ్రాయేలీయులను దేవుడు అప్పగించెను; నా పేరేమిటి?
12. అన్యరాజులమైన మా చేతికి యేడేండ్లు దేవుడు ఇశ్రాయేలీయులను అప్పగించెను;మా పేర్లేమిటి?
13. అన్యరాజునైన నా చేతికి యెహోవా దృష్టికి చెడుతనము చేసిన ఇశ్రాయేలీయులను దేవుడు అప్పగించెను; నాపేరేమిటి?
14. అన్యదేశమైన మా చేతికి ఇశ్రాయేలీయుల మొదటి రాజైన సౌలును దేవుడు అప్పగించెను; నా దేశము పేరేమిటి?
15. అన్యరాజునైన నా చేతికి యెహోవా యెదుట పాపముచేసిన యూదా పరాక్రమశాలురను దేవుడు అప్పగించెను; నా పేరేమిటి?
Result: