1. LEADERS అనగా అర్ధము ఏమిటి?
2. మొదట ఎవరి వంశములో "నాయకులు"పాలించేవారు?
3. ప్రజలపైన యున్న "నాయకులకు" ఎవరు పని నిమిత్తము ఆజ్ఞాపించెను?
4. "నాయకులు"లేని జనులు ఏమగుదురు?
5. భయపడి ఏ గుండె గలవాడు తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు ఇంటికి వెళ్లవచ్చని "నాయకులు"జనులతో చెప్పవలెను?
6. మూడు దినములలోగా యొర్దాను దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుమని ఎవరు ప్రజల "నాయకులతో"చెప్పెను?
7. దేని "నాయకులు"కలవరపడుదురు?
8. యెహోవా చేసిన దేనిలో పాలు పొందుటకై ఇశ్రాయేలీయుల "నాయకులు"కూడా ఆయన సన్నిధిని నిలిచియున్నారు?
9.నా ప్రజలారా, మీ "నాయకులు" ఏమి తప్పించువారని, యెహోవా అనెను?
10. ప్రజ్ఞావంతులు నీకు ఓడ "నాయకులుగా" ఉన్నారని యెహోవా ఎవరితో అనెను?
11. మీ గోత్రముల "నాయకులను"పోగుచేయుడి, వారి మీద వేటిని సాక్షులుగా పెట్టి ధర్మశాస్త్రగ్రంధములో మాటలను చెప్పెదనని మోషే జనులతో చెప్పెను?
12. మనపైన "నాయకులుగా" ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి యొక్క ఏమి శ్రద్ధగా తలంచుకొనవలెను?
13."నాయకులు"దుర్మార్గులకు ఏమి చేయుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడియుండవలెను?
14. మనపైన "నాయకులుగా" ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారై మన యొక్క వేటిని కాయుచున్నారు?
15. యాకోబు సంతతి వారికి యెహోవా "నాయకుడుగా"ఉండునని ఏ ప్రవక్త చెప్పెను?
Result: