1. యెహోవా ఎవరి "నాసిక"రంధ్రములలో జీవవాయువును ఊదెను ?
2. తన "నాసిక రంధ్రములలో ఏమి కలిగిన నరుని లక్ష్యపెట్టకుము అని యెహోవా చెప్పెను?
3. యెహోవా యొక్క దేని వలన ఆయన "నాసిక" రంధ్రములలో నుండి పొగ పుట్టెను?
4. ఎప్పుడు తమ "నాసిక"రంధ్రములలో జీవాత్మ కలిగిన జీవులన్నియు చనిపోయెను?
5. ఎవరు తమ "నాసిక" రంధ్రములలో అసహ్యము పుట్టువరకు మాంసము తిందురని యెహోవా అనెను?
6. యెహోవా "నాసిక" రంధ్రముల ఊపిరి వలన నీళ్ళు రాశిగా కూర్చబడెనని ఎవరు కీర్తన పాడిరి?
7. దేవుని ఆత్మనా "నాసిక"రంధ్రములలో ఉండుటను బట్టి నేను అబద్ధము పలుకుట లేదని ఎవరు అనెను?
8. యెహోవా "నాసికా"రంధ్రముల శ్వాసము వలన వేటి అడుగుభాగములు కనబడెను?
9. దేని "నాసికా" రంధ్ర ధ్వని భీకరము?
10. తమ ఆలోచనలను అనుసరించి ఎలా నడుచువారు యెహోవా "నాసికా" రంధ్రములకు పొగవలె యున్నారు?
11. యెహోవా చేత ఏమి నొందినవాడు మాకు "నాసికా"రంధ్రముల ఊపిరి వంటివాడని సీయోను అనెను?
12. ఇశ్రాయేలీయుల దండు పేటలో పుట్టిన దుర్గంధము వారి "నాసికా"రంధ్రములకు ఎక్కునంతగా ఎవరిని ఖడ్గము చేత యెహోవా హతము చేయించును?
13. తన "నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని ఏవిషయములోనైనను ఏమి చేయనక్కరలేదని యెహోవా చెప్పెను?
14. దేని మాంసము తిని పరిశుధ్ధులమని చెప్పుకొను వారు యెహోవా "నాసికా" రంధ్రములలో పొగ వలెను ఉన్నారు?
15. షూలమ్మితీ "నాసిక"ఏ దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము?
Result: