Bible Quiz in Telugu Topic wise: 460 || తెలుగు బైబుల్ క్విజ్ ("నిట్టూర్పులు" అనే అంశము పై క్విజ్)

1. సంతోషమైన ఏమి గలవారందరు "నిట్టూర్పు" విడుచుదురు?
ⓐ మనస్సు
ⓑ తలంపు
ⓒ హృదయము
ⓓ ఆలోచన
2. భోజనమునకు మారుగా నాకు "నిట్టూర్పు" కలుగుచున్నదని ఎవరు అనెను?
ⓐ దావీదు
ⓑ హిజ్కియా
ⓒ జెకర్యా
ⓓ యోబు
3. చెరలో నున్న వారి "నిట్టూర్పు"నీ సన్నిధికి రానిమ్మని ఎవరు ప్రార్ధించెను?
ⓐ దానియేలు
ⓑ ఆసాపు
ⓒ నాతాను
ⓓ నెహెమ్యా
4. "నిట్టూర్పులు" విడుచుటలో నా యేండ్లు గతించుచున్నవని ఎవరు ప్రార్ధించెను?
ⓐ దావీదు
ⓑ ఎజ్రా
ⓒ యోవేలు
ⓓ హగ్గయి
5. ఎవరి "నిట్టూర్చంతయు" మాన్పి వేయుదునని యెహోవా సెలవిచ్చెను?
ⓐ దర్శనపులోయవారి
ⓑ అడవి దేశపువారి
ⓒ అష్షూరీయుల
ⓓ ఐగుప్తీయుల
6. ఎవరి "నిట్టూర్పులను"బట్టి నేనిప్పుడే లేచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు?
ⓐ బీదల
ⓑ బాధితుల
ⓒ విధవరాండ్ర
ⓓ దరిద్రుల
7. ఎక్కడ "నిట్టూర్చంతయు" ఎగిరిపోవును?
ⓐ మహనయీములో
ⓑ తిర్సాలో
ⓒ హెర్మోనులో
ⓓ సీయోనులో
8. నీ నడుము బద్దలగునట్లు "నిట్టూర్పు" విడువమని యెహోవా ఎవరితో చెప్పెను?
ⓐ యెహెజ్కేలు
ⓑ యెషయా
ⓒ యిర్మీయా
ⓓ యోవేలు
9. యెరూషలేము కాపురస్థులు "నిట్టూర్పులు" విడుచుచు ఏమి వెదకుదురు?
ⓐ రక్షణ
ⓑ ఆహారము
ⓒ గుడారము
ⓓ దాగుచోటు
10. సీయోను పట్టణపు గుమ్మములు పాడైపోగా ఎవరు "నిట్టూర్పులు" విడుచుచున్నారు?
ⓐ యాజకులు
ⓑ పరిచారకులు
ⓒ ప్రవక్తలు
ⓓ రాజులు
11. తాము చేయుచున్న దేనిని బట్టి ఇశ్రాయేలీయులు "నిట్టూర్పులు"విడుచుచున్నారు?
ⓐ దోషములను
ⓑ వెట్టి పనులను
ⓒ తిరుగుబాటును
ⓓ అతిక్రమములను
12. ఎవరిని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను "నిట్టూర్పు"విడుచుచున్నానని కీర్తనాకారుడు అనెను?
ⓐ దేవుని
ⓑ మనుష్యులను
ⓒ రాజులను
ⓓ ప్రవక్తలను
13. "నిట్టూర్పులు" విడిచినట్టు మా జీవితకాలము గడిపితిమని ఎవరు అనెను?
ⓐ దావీదు
ⓑ దానియేలు
ⓒ ఏతాను
ⓓ మోషే
14. ఎవరు ఏలునప్పుడు ప్రజలు "నిట్టూర్పులు"విడుచుదురు?
ⓐ బీదవాడు
ⓑ అజ్ఞాని
ⓒ కపటి
ⓓ దుష్టుడు
15. మృతులకై విలాపము చేయక నిశబ్దముగా "నిట్టూర్పు"విడువుమని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
ⓐ యెహెజ్కేలునకు
ⓑ యెషయాకు
ⓒ యిర్మీయాకు
ⓓ జెఫన్యాకు
Result: