Bible Quiz in Telugu Topic wise: 462 || తెలుగు బైబుల్ క్విజ్ ("నిద్ర" అనే అంశము పై క్విజ్)

1. మొట్టమొదటగా "నిద్రలో"కల కనినదెవరు?
A నోవహు
B లెమెకు
C హనోకు
D యాకోబు
2. ఎవరు తన తొడమీద సమ్సోనును "నిద్రబుచ్చి అతని యేడు జడలను క్షౌరము చేయించెను?
A గాజావేశ్య
B తిమాృతు స్త్రీ
C దేలీలా
D హెబరు
3:నేను నిద్రపోయి మేలుకొందును ఎంతమంది మోహరించినను నేను భయపడను అని దావీదు అనెను?
A పదివేలు
B యెడువేలు
C మూడువేలు
D ఐదువేలు
4 ప్ర. లేవకుండా "నిద్ర"పోవుచున్న సోమరి యొద్దకు ఎవరు వచ్చునట్లు దారిద్ర్యము వచ్చును?
A పనికిమాలినవాడు
B దుర్మార్గుడు
C దోపిడిగాడు
D బుద్ధిహీనుడు
5 ప్ర. అలసట చేత గాఢ "నిద్ర"పోయిన సీసెరాను మేకును కణతలలో దిగగొట్టి చంపినదెవరు?
A హెబెరు
B దెబోరా
C బారాకు
D యాయేలు
6. "నిద్ర" మత్తు ఏమి ధరించుటకు కారణము?
A మలినవస్త్రములు
B చింపిగుడ్డలు
C మురికి పోలికలు
D మరకలదుస్తులు
7ప్ర. దేనికి భయపడి "నిద్ర"యందు ఆసక్తి విడువవలెను?
A లేమికి
B కష్టముకు
C నష్టముకు
D ఇబ్బందికి
8.యాకోబు యొక్క ఎవరికి ఒక నివాసస్థలము చూచువరకు నా కన్నులకు "నిద్ర"రానియ్యనని కీర్తనాకారుడు అనెను?
A రాజుకు
B సైన్యాధిపతికి
C శూరునికి
D బలిష్టునికి
9ప్ర. తటాక జలములు నదినీరు ఇంకి హరించిపోవునట్లు ఎవరు పండుకొనగా వారిని "నిద్ర"లేపజాలరు?
A రాజులు
B నరులు
C అధిపతులు
D అన్యులు
10ప్ర. ఎవరు కొద్దిగా తినినను వారు సుఖ"నిద్ర" నొందుదురు?
A బీదవారు
B భిక్షగాండ్రు
C కష్టజీవులు
D దరిద్రులు
11. యొహోవా సన్నిధిలో నుండి పారిపోయిన యోనా ఎక్కడికి పోవు ఓడ ఎక్కి దాని అడుగుభాగమున పండుకొని గాఢ"నిద్ర"పోయెను?
A మెక్నెషుకు
B నీనెవెకు
C ఎదోముకు
D తరీషుకు
12. ప్రసంగించుచు మాటలాడుచుండగా ఎవరు గాఢ"నిద్ర"పోయి జోగి క్రిందపడి చనిపోయెను?
A ఐతుకు
B ఐనెయ
C ఎరస్తు
D గాయి
13. ఎవరు కలలు కని దాని గురించి మనస్సు కలతపడుట వలన అతనికి "నిద్ర"పట్టకయుండెను?
A పరో
B నెబుకద్నెజరు
C దర్యావేషు
D అర్థహషెస్త్
14. ఎవరికి తమ ధనసమృద్ధి వలన "నిద్ర"పట్టదు?
A ధనవంతులకు
B భాగ్యవంతులకు
C ఐశ్వర్యవంతులకు
D ఆస్తిపరులకు
15. ఎవరిని కాపాడువాడు కునుకడు "నిద్ర"పోడు?
A భక్తులను
B ప్రజలను
C రాజులను
D ఇశ్రాయేలును
Result: