1. ఎవరికి సంతోషము ఒక "నిమిషమాత్ర"ముండును?
2. దేనికి శ్రమలు హఠాత్తుగా ఒక్క "నిమిషము"లోనే సంభవించును?
3. పూర్వము నుండి ఎవరు ఆకాలముగా ఒక "నిమిషము"లోనే నిర్మూలమైరి?
4. "నిమిషములో"నా డేరా తెరలును ప్ర. దోచుకొనబడుచున్నవని ఎవరు అనెను?
5. నరులు శరీరులు "నిమిషము"లోనే చనిపోవుదురని ఎవరు అనెను?
6. ఒక్క "నిమిషముననే"పుత్రశోకము వైధవ్యమును నీకు సంభవించునని యెహోవా ఎవరితో అనెను?
7. యొర్దాను ప్రవాహములో దేని వలె వచ్చుచున్న శత్రువులను "నిమిషము"లోనే తోలివేయుదునని యెహోవా అనెను?
8. ఏది "నిమిష"మాత్రములోనే కూలి తుత్తునియలాయెను?
9. "నిమిషమాత్రము నిన్ను విసర్జించి దేనితో నిన్ను సమకూర్చెదని యెహోవా అనెను?
10. ఒక్క నిమిషములోనే"ఏమి జన్మించునా? అని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు?
11. ఎవరును దాని మీద చేయి వేయకుండనే "నిమిషములో"ఏ పట్టణము పాడుచేయబడును అని యెహోవా అనెను?
12. ఏమగు ద్రాక్షావనమునకు యెహోవా ప్రతి "నిమిషమున"నీరు కట్టుచుండెను?
13. ఎవరు కోపపడునది "నిమిషము" లోనే బయలుపడును?
14. ఏమి కలిగి "నిమిష"మాత్రము నీకు విముఖడనైతినని యెహోవా అనెను?
15. యెహోవా యొక్క ఏమి "నిమిష" మాత్రముండును?
Result: