1. అకాలమందు ఎవరితో సహపౌరులు కాక,"నిరీక్షణ"లేనివారముగా యున్నాము?
2. దేని విషయమైన "నిరీక్షణ" యందుండుటకు పిలువబడితిమి?
3. మన "నిరీక్షణ"ఏమగు నిమిత్తము ఇది వరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెను?
4. మన యెదుట ఉంచబడిన "నిరీక్షణను"చేపట్టుటకు ఏమి కలుగునట్లు యేసు తన వాగ్దానమును ధృఢపరచెను?
5. ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున అది ఏమి చేయబడి అంతకంటే శ్రేష్టమైన "నిరీక్షణ"దాని వెంట ప్రవేశపెట్టబడెను?
6. మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట తిరిగి లేచుట వలన దేనితో కూడిన "నిరీక్షణ"మనకు కలుగుచున్నది?
7. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు తేబడు దేని విషయమై సంపూర్ణ "నిరీక్షణ"కలిగియుండవలెను?
8. మన "నిరీక్షణ" ఎవరి యందు ఉంచబడియున్నది?
9. మనకున్న "నిరీక్షణను"బట్టి ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను ఏమి చెప్పుటకు సిద్ధముగా ఉండవలెను?
10. ఎక్కడ మన కొరకు "నిరీక్షణ"ఉంచబడియున్నది?
11. సువార్త సత్యమును గూర్చిన బోధ వలన "నిరీక్షణ"ను గూర్చి వినిన సంఘము ఏది?
12. "నిరీక్షణ"గల వారమై ఏమి చేయవలెను?
13. ఏది "నిరీక్షణను"కలుగజేయునని ఎరగవలెను?
14. దేవుని యొక్క దేనిని గూర్చిన "నిరీక్షణను" బట్టి అతిశయపడుచున్నాము?
15. శుభ "నిరీక్షణను"అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడు మన యొక్క దేనిని ఆదరించును?
Result: