1Q. "నిర్ణయ కాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును ఎవరిలో కొందరు కూలుదురు?
2. దేవుడు తన చిత్ర ప్రకారమైన దేనిని బట్టి మనలను ముందుగా "నిర్ణయించి", ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను?
3 Q. పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను "నిర్ణయించు"కున్న వారు ఎవరు?
4. విధి నిర్ణయము కాకమునుపే ఏది మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి?
5 Q. నీ కట్టడలను గైకొనుటకు దేనిని నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య"నిర్ణయము"అని దావీదు అనెను?
6 Q. ఎవరు మాటవిని హృదయమును దేవుని వాక్యమును మహిమపరచి నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి?
7. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవుచున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి ఏమి కలుగును?
Q8. దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతానును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు ఎవరిని ఏర్పాటుచేసెను?
9. దేవుడు ఎవరితో చెప్పిన నిర్ణయ కాలములో ఎవరు గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను?
10 Q. ఎవరికి అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను?
11. ఎవరు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైనవారిని చెరకును అప్పగించుచు ఐగుప్తీయులను హతముచేయును?
12 Q. ఇశ్రాయేలు వారి దోషమును యెహెజ్కేలు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున ఎన్ని దినములు దేవుడు నిర్ణయించెను?
13Q. దైవదృష్టికి ఇష్టుడగు వాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని దేవుడు ఎవరికి నిర్ణయించును?
14. రాజునొద్దకు వెళ్లుటకు వంతు వచ్చినప్పుడు రాజుయొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమియు కోరుకొనని స్త్రీ ఎవరు?
15: మోషెను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తుదేశములో నుండి రప్పించినవాడు యెహోవాయే గదా అని ఎవరు జనులతో అనెను?
Result: