1. Destroy అనగ అర్ధము ఏమిటి?
2. ఎవరు రాజ్యపరిపాలన చేయకుండునట్లు యెహోవా వారిని "నిర్మూలము"చేయును?
3. దుష్కామకార్యము నా ఆదాయమంతయు "నిర్మూలము"చేయునని ఎవరు అనెను?
4. ఒక క్షణమాత్రము మీ నడుమకు వచ్చితినా,మిమ్మును "నిర్మూలము"చేసెదను గనుక మీ యొక్క వేటిని తీసివేయుమని యెహోవా ఇశ్రాయేలీయులతో చెప్పెను?
5. కనానీయులను అప్పగించిన యెడల వారిని "నిర్మూలము"చేసెదమని ఇశ్రాయేలీయులు యెహోవాను ఏమి చేసిరి?
6. కనానీయులను వారి పట్టణములను "నిర్మూలము" చేసి ఇశ్రాయేలీయులు ఆ చోటికి ఏమని పేరు పెట్టిరి?
7. ఇశ్రాయేలీయులు ఏ పట్టణమును కత్తివాతచేత "నిర్మూలము"చేసెను?
8. హాయినివాసులందరిని "నిర్మూలము"చేయువరకు ఎవరు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని ముడుచుకొనలేదు?
9. ఎవరికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి వారిని "నిర్మూలము"చేయుమని సమూయేలు సౌలుతో చెప్పెను?
10. సౌలు అమాలేకీయుల రాజైన ఎవరిని "నిర్మూలము"చేయలేదు?
11. పాపాత్ములైన అమాలేకీయులను"నిర్మూలము చేయుమని చెప్పిన యెహోవా మాట వినక దేనిమీద ఎగబడి కీడు చేసితివని సమూయేలు సౌలుతో అనెను?
12. జనములను "నిర్మూలము"చేసి ఇశ్రాయేలీయులను వ్యాపింపజేసితివని ఎవరు యెహోవాతో అనెను?
13. ఏమి లేకుండనే యెహోవా బలవంతులను "నిర్మూలము"చేయును?
14. భక్తిహీనులు నిశ్చయముగా "నిర్మూలమగుట" ఎవరు చూచి సంతోషించుదురు?
15. ఎటువంటి నాలుక గలవానిని యెహోవా సజీవుల దేశములో నుండి "నిర్మూలము"చేయును?
Result: