1. విశ్వాసముందు "నిలుకడ"గా యుండి చేయు కార్యములన్నీ ఎలా చేయవలెను?
2. యెహోవా వాక్యము ఎక్కడ నిత్యము "నిలుకడగా" నున్నది?
3. ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన వేటిని చేయుట యందు "నిలుకడగా" ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు?
4. ప్రార్ధన యందు "నిలుకడగా"యుండి ఏమి గలవారై యుండవలెను?
5. కొలస్సీ సంఘము సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై "నిలుకడగా"యుండాలని ఎవరు తన ప్రార్ధనలో పోరాడుచున్నాడు?
6. "నిలుకడగా"యుండి మీకు బోధింపబడిన విధులను చేపట్టుమని పౌలు ఏ సంఘ సహోదరులకు వ్రాసెను?
7. స్త్రీలు విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు "నిలుకడగా"ఉండిన యెడల దేని ద్వారా వారు రక్షింపబడును?
8. నిజముగా అనాధయైన ఎవరు విజ్ఞాపనల యందును ప్రార్ధనల యందును "నిలుకడగా"ఉండును?
9. దేవుని యొక్క ఏమైన పునాది "నిలుకడగా" ఉన్నది?
10. తాను నేర్చుకొనిన శక్తిగల వేటి యందు "నిలుకడగా" ఉండుమని పౌలు తిమోతికి వ్రాసెను?
11. వేటిని గూర్చి నేను చేసిన నిబంధన "నిలుకడ"గా ఉండని యెడల నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతునని యెహోవా అనెను?
12. కొరింథీ సంఘము దేనిచేత "నిలుకడగా" యుండెను?
13. ఏమి మట చలింపచేయబడనివి "నిలుకడగా"ఉండు నిమిత్తము బొత్తిగా తీసివేయబడనివని అర్ధమిచ్చుచున్నది?
14. స్వాతంత్ర్యము నిచ్చు దేనిలో తేరి చూచి "నిలుకడగా"ఉండువాడెవడో వాడు తన క్రియలో ధన్యుడగును?
15. అంత్యము వరకు "నిలుకడగా" ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమున నీ వంతులో నిలిచెదవని ఎవరితో దూత చెప్పెను?
Result: