Bible Quiz in Telugu Topic wise: 471 || తెలుగు బైబుల్ క్విజ్ ("నిలకడ" అనే అంశము పై క్విజ్-2)

1Q. "నిలకడ" (నిలుచుట) అనగా ఏమిటి?
A స్థిరత్వము ; నిత్యము
B నిరంతరము ; నిశ్చలము
C కట్టుబడి ; బద్ధత
D పైవన్నియు
2 Q. దేని యందు నిలకడగా నుండవలెను?
A మాట
B పని
C విశ్వాసము
D జ్ఞానము
3Q. ఎవరు నిత్యము నిలుచు కట్టడము వలె నుండును?
A భక్తిగలవాడు
B నీతిమంతుడు
C మంచివాడు
D ధనవంతుడు
4Q.దేని మీద కట్టబడిన వారమై స్థిరముగా నుండవలెను?
A పునాది
B ఇసుక
C ప్రాకారము
D నేల
5 Q. ఏ సంఘము విశ్వాసమందు నిలకడగా యున్నదని పౌలు చెప్పెను?
A గలతీ
B ఎఫెసీ
C కొరింథీ
D ఫిలిప్పీ
6 Q. ప్రభువునందు స్థిరముగా నిలిచిన ఏమౌదుము?
A కాపాడబడుదుము
B ధైర్యపడుదుము
C బ్రదుకుదుము
D నడిపింపబడుదుము
7. సంపూర్ణత యందు పూర్ణులగునట్లు దేని యందు వేరుపారి స్థిరపడ వలెను?
A దయ
B కరుణ
C జాలి
D ప్రేమ
8 Q. ఎవరు బోయజు పొలములో నిలకడగా నుండెను?
A నయోమి
B ఓర్ఫా
C రూతు
D రాహేలు
9 Q. దేవుని యందు మనయెదుట ఉంచబడిన ఏది నిశ్చలము స్థిరమునై యున్నది?
A విశ్వాసము
B నిరీక్షణ
C నమ్మకము
D మేలు
10 Q. అపవాది ఎలా యోబు గురించి యెహోవాను ప్రేరేపించిన గాని అతను యధార్ధతను విడువక నిలకడగా నుండెను?
A పగతో
B కోపము
C నిష్కారణముగా
D ఆగ్రహముతో
11Q. క్రీస్తు యొక్క వాక్యమందు నిలిచిన వారమైతే ఆయనకు ఏమై యుందుము?
A దాసులము
B శిష్యులము
C సాటివారము
D బిడ్డలము
12 Q. దేనిని జరిగించువాడు నిరంతరము నిలుచును?
A సేవను
B పరిచర్య
C దేవుని చిత్తము
D దేవుని పని
13: నిలకడ అను మాట రూతు పుస్తకము 2వ అధ్యాయములో ఎన్నిసార్లు కలదు?
A రెండు
B నాలుగు
C అయిదు
D మూడు
14Q. స్థిరులను కదలని వారమై ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఎలా యుండవలెను?
A మాంద్యులై
B ఆసక్తులునై
C ఆకాంక్షులై
D అనింద్యులై
15Q. మనలను స్థిరపరచుటకు శక్తిమంతుడైన దేవునికి నిరంతరము ఏమి కలుగును గాక.
A ప్రభావము
B గొప్పపేరు
C మహిమ
D ధన్యత
Result: