1. "నిష్ ప్రయోజనము" అనగా హెబ్రీ భాషలో అర్థము ఏమిటి?
2. "నిష్ ప్రయోజనమైన"మాటల చేత వాదింపదగునా? అని ఎవరు అనెను?
3. విగ్రహమును నిర్మించువారికి ఏమైన విగ్రహములు "నిష్ ప్రయోజనములు"?
4. దేని వలని సహాయము "నిష్ ప్రయోజనమైనది"?
5. వేశ్య సంతానమైన వారి యొక్క ఏమి "నిష్ ప్రయోజనము"లగును?
6. ఎవరు "నిష్ ప్రయోజనమైన"వాటిని అనుసరింతురు?
7. ఎక్కడ నుండి జనములు యెహోవా యొద్దకు వచ్చి మా పితరులు "నిష్ ప్రయోజనమైన" వాటిని స్వతంత్రించుకొనిరని చెప్పుదురు?
8. యూదా యెరూషలేము వారు నీ మాట "నిష్ ప్రయోజనము", మా యొక్క దేనిని చొప్పున నడుచుకొందము అని యెహోవాతో యందురు?
9. ఏమైన స్వప్నములును మాటలును "నిష్ ప్రయోజనములు"?
10. ఇశ్రాయేలు నమ్ముకొనుచున్న ఏ మాటలు "నిష్ ప్రయోజనములని"యెహోవా అనెను?
11. "నిష్ ప్రయోజనమైన" మూలపాఠముల తట్టు మరల తిరుగనేల? అని పౌలు ఏ సంఘముతో అనెను?
12. సువార్త వినిన వారితో ఏమి గలవారై కలిసియుండని యెడల వాక్యము వారికి "నిష్ ప్రయోజనమైన"దాయెను?
13. మన పైని నాయకులుగా యున్నవారు ఆత్మలు కాయు పని ఎలా చేసిన యెడల అది "నిష్ ప్రయోజనము"?
14. కొందరు ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి "నిష్ ప్రయోజనమైన"వేటికి తిరిగిరి?
15. మునుపు "నిష్ ప్రయోజనమైన"వాడైన ఎవరిని యిప్పుడు ప్రయోజనమైన వాడని పౌలు అనెను?
Result: