1. ఇశ్రాయేలీయులు ఏ వృక్షముల క్రిందను "నీడ" మంచిదని అచటనే ధూపము వేయుదురు?
2. అవయవములన్నియు "నీడ"వలె ఆయెనని ఎవరు అనెను?
3. భూజనులందరును ఎవరి "నీడ"ను విడిచి అతనిని పడియుండనిచ్చిరి?
4. ఎటువంటి "నీడ"వలె నేను క్షీణించియున్నానని దావీదు అనెను?
5. నీడ"వలె మనుష్యులు ఎలా తమ దినములన్నియు గడుపుకొందురు?
6. ఎవరు దేవుని సన్నిధిని "నీడ"వంటి దీర్ఘాయువును పొందకపోవుదురు?
7. దేశపరిత్యాగులగు వారు బలహీనులై దేని "నీడ"లో నిలిచియున్నారు?
8. ఎవరు స్వస్థత పొందెననుటకు సూచనగా "నీడ"పదిమెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు యెహోవా చేసెను?
9. ఎక్కడ చిత్తగూబ గుడ్లుపెట్టి పొదిగి "నీడ"లో వాటిని కూర్చును?
10. చీకటి కమ్మినట్లు ఎప్పుడు యెహోవా "నీడ"ను వారి మీద ఉండనియ్యమని ఆర్నోను జనులు అనిరి?
11. మనుష్యులు వట్టి"నీడ"వంటివారై తిరుగులాడుదురు అని ఎవరు అనెను?
12. నెబుకద్నెజరు రాజుకు వచ్చిన కలలో కనిపించిన చెట్టు "నీడ'ను ఏవి పండుకొనెను?
13. భూమి మీద మన దినములు "నీడ"వలె నున్నవని ఎవరు అనెను?
14. ఇశ్రాయేలీయులు ఐగుప్తు "నీడ"ను శరణుజొచ్చుట వలన వారికి ఏమి కలుగును?
15. ఇశ్రాయేలు "నీడ"యందు నివసించువారు మరలి వత్తురు అని ఏ ప్రవక్త ద్వారా యెహోవా ప్రవచింపచేసెను?
Result: