1. యెహోవా సెలవు నొందిన దైవజనుడైన యొకడు ఎక్కడికి వచ్చి బలిపీఠముతో మాటలాడెను?
2. దేవుని వాక్కు దైవజనుడైన ఎవరికి ప్రత్యక్షమయ్యెను?
3. దైవజనుడైన ఎవరు తాను మృతి నొందక మునుపు ఇశ్రాయేలీయులను దీవించెను?
4. సౌలు పనివాడు సౌలునకు చెప్పిన దైవజనుడు ఎవరు?
5. దైవజనుడగు ఎవరి యొక్క వాద్యములు యెహోవా మందిరములో వాయించిరి?
6. దైవజనుడా, నా యొద్దకు వచ్చి నా పాపము నాకు జ్ఞాపకము చేసితివని సారెపతు స్త్రీ ఎవరితో అనెను?
7. దైవజనుడా, నా యేలినవాడా అని షూనేమియురాలు ఎవరిని అనెను?
8. దైవజనుడొకడు ఎవరి యొద్దకు వచ్చి యెహోవా సెలవిచ్చిన మాట తెలిపెను?
9. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినది ఎవరు?
10. యేసుక్రీస్తు దాసుడైన ఎవరు అమూల్యమైన విశ్వాసము పొందినవారికి పత్రిక వ్రాసెను?
11. యేసుక్రీస్తు దాసుడైన ఎవరు యేసుక్రీస్తు నందు భద్రము చేయబడిన వారికి పత్రిక వ్రాసెను?
12. దైవజనుడా అని పౌలు ఎవరిని సంబోధించెను?
13. దేవుని దాసుడు అని పౌలు ఎవరి గురించి చెప్పెను?
14. యేసుక్రీస్తు తన దాసుడైన ఎవరికి ప్రత్యక్షత అనుగ్రహించెను?
15. దైవజనుడు సన్నద్ధుడై ప్రతియొక్క దేనికి పూర్ణముగా సిద్ధపడి యుండవలెను?
Result: