1.ఎవరిని యెహోవాకు నూతనకీర్తన పాడుమని కీర్తనాకారుడు అనెను?
2. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాననిన యెహోవా ఎక్కడ నదులను పారజేయుచున్నాననెను?
3. అనుదినము యెహోవాకు నూతనముగా ఏమి పుట్టుచున్నది?
4. ఏమైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందవలెను?
5. యేసు నూతనమైనదియు జీవము గలదైన తన యొక్క దేని ద్వారా మార్గము యేర్పర్చెను?
6.నూతనమైన యెరూషలేము అను ఏమి తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తె వలె సిద్ధపడెను?
7. ఇశ్రాయేలు కుమారి యొక్క దేశములో యెహోవా నూతనకార్యము జరిగించుచున్నాడని ఎవరు అనెను?
8. నూతనమైన ఏమి మీకిచ్చెదనని యెహోవా ఇశ్రాయేలీయులతో అనెను?
9. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానను మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని దేవుడు ఎవరితో చెప్పెను?
10. మా యొక్క ఎవరు దినదినము నూతనపరచబడుచున్నాడని పౌలు అనెను?
11. క్రీస్తు నందున్నవాడు నూతనమైన ఏమై యున్నాడు?
12 .ఇశ్రాయేలీయులకు యెహోవా ఏమి కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతుననెను?
13. దేని క్రింద నూతనమైన దేదియు లేదని ప్రసంగి చెప్పెను?
14. ప్రాచీన స్వభావము వదలుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడినవారై యుండవలెనని పౌలు ఏ సంఘముతో అనెను?
15. నూతనమైన దేనిని యెహోవా ఇశ్రాయేలీయులకు కలుగజేసి రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇచ్చెదననెను?
Result: