1ప్ర. కుష్టరోగము తగ్గిన తరువాత ఏ ప్రవక్త యొద్దకు వచ్చిన నయమానును అతను "నెమ్మది" గలిగి పొమ్మనెను?
2 ప్ర. దేనిని బట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు "నెమ్మది"పుట్టించును?
3. ఎవరికి "నెమ్మది"యుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు?
4 ప్ర."నెమ్మదితో" పండుకొని నిద్రపోవుదును అని ఎవరు యెహోవాతో అనెను?
5 . మిక్కుటమైన ఆయాసము నాకు "నెమ్మది" కలుగుటకు కారణమాయెనని ఎవరు అనెను?
6 ప్ర.ఏ రాజు కాడిక్రిందకి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయు జనులకు యెహోవా "నెమ్మది"కలుగజేతుననెను?
7ప్ర. యెహోవా యొక్క ఏమి ప్రాణమునకు "నెమ్మది"కలుగజేయుచున్నది?
8 . యెహోవా సన్నిధిని ధీనత్వము ధరించిన ఏ రాజుతో ఆయన, నీవు "నెమ్మది"పొందినవాడవై సమాధికి చేర్చబడుదువనెను?
9 ప్ర.నాకు "నెమ్మది"లేదు శ్రమయే సంభవించుచున్నదని ఎవరు అనెను?
10ప్ర. దేనికి "నెమ్మది" లేదని యెహోవా సెలవిచ్చెను?
11. యెహోవా వాక్యము దేనిలో "నెమ్మది"కలిగించుచున్నది?
12. నెమ్మది" లేకుండా ఏమి యుండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు?
13. యెరూషలేము యొక్క దేనిలో "నెమ్మది" కలుగును గాక అని కీర్తనాకారుడు అనెను?
14ప్ర. యెహోవా ధర్మశాస్త్రమును ఏమి చేయువారికి ఎంతో "నెమ్మది"కలదు?
15. అబ్రాహాము రొమ్మున ఆనుకొని యున్న ఎవరు అక్కడ "నెమ్మది"పొందుచున్నాడు?
Result: