Bible Quiz in Telugu Topic wise: 492 || తెలుగు బైబుల్ క్విజ్ ("న్యాయము" అనే అంశముపై క్విజ్)

1. ఎవరికి తీర్పుతీర్చి యెహోవా "న్యాయము"చేయును?
ⓐ సర్వలోకమునకు
ⓑ దుష్టులకు
ⓒ అన్యాయస్థులకు
ⓓ మోసగాండ్రకు
2. ఎవరు "న్యాయకర్తయై"యుండెను?
ⓐ దేవుడు
ⓑ రాజు
ⓒ మహాదూత
ⓓ చక్రవర్తి
3. "న్యాయము" తీర్చుటకై నాకు వివేకము గల హృదయమును దయచేయుమని ఎవరు దేవునిని అడిగెను?
ⓐ దావీ
ⓑ సొలొమోను
ⓒ హిజ్కియా
ⓓ ఆసా
4. యెహోవా నాకును, నీకును న్యాయము తీర్చును గాక, అని శారా ఎవరితో అనెను?
ⓐ హాగరు
ⓑ ఎలియాజరు
ⓒ అబ్రాహాము
ⓓ అబీమెలెకు
5. పగతీర్చుకొనకుండా నిన్ను విడిచి పెట్టాను, కావున దేవుడు నీకును, నాకును "న్యాయము" తీర్చును గాక అని దావీదు ఎవరితో అనెను?
ⓐ ఆకీషు
ⓑ సౌలు
ⓒ అబ్దాలోము
ⓓ అదోనీయా
6. యెహోవా "న్యాయవిధులు" ఎటువంటివి?
ⓐ సత్యమైనవి
ⓑ మంచివి
ⓒ గొప్పవి
ⓓ నడిపించేవి
7."న్యాయము"తప్పిపోకుండా దేవుడు ఎవరి ప్రవర్తనను కాచును?
ⓐ నా సేవకుల
ⓑ ప్రవక్తల
ⓒ భక్తుల
ⓓ పనుల
8. యెహోవా న్యాయవిధులు ఏమై యున్నవి?
ⓐ మంచివి
ⓑ ఉత్తమము
ⓒ గొప్పవి
ⓓ మార్గము
9. దేవుడు నీతిని "న్యాయమును" ఏమి చేయును?
ⓐ శోధించును
ⓑ నడుపును
ⓒ ప్రేమించును
ⓓ జరుపును
10. ఏది "న్యాయమో" మీరంతట మీరు విమర్శింపరేల, అని యేసు ఎవరితో అనెను?
ⓐ శిష్యులతో
ⓑ జనసమూహముతో
ⓒ శాస్త్రులతో.
ⓓ ప్రధానులతో
11. సర్వశక్తుడు "న్యాయమును" ఏమి చేయడు?
ⓐ తప్పడు
ⓑ జరుపడు
ⓒ విధింపడు
ⓓ మరువడు
12. "న్యాయవిమర్శ"లో ఎవరు నిలువరు?
ⓐ దుర్మార్గులు
ⓑ దుష్టులు
ⓒ గుణవంతులు
ⓓ ద్రోహులు
13. ఎవరి మీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థత పరచుట "న్యాయమా"? అని పరిసయ్యులు అడిగిరి?
ⓐ యేసుక్రీస్తు
ⓑ శిష్యుల
ⓒ న్యాయాధిపతుల
ⓓ జనముల
14. లోకములో న్యాయముండవలసిన చోట ఏమి కనిపిస్తుంది?
ⓐ అధర్మము
ⓑ దుర్మార్గత
ⓒ ఘోరము
ⓓ మోసము
15. యెహోవా "న్యాయవిధులు"ఏమి చేయును?
ⓐ నడిపించును
ⓑ బ్రదికించును
ⓒ భరించును
ⓓ కాపాడును
Result: