1. ఏదెను తోటలో నున్న ప్రతివృక్ష "ఫలములను"ఎలా తినవచ్చునని యెహోవా నరునితో అనెను?
2. సూర్యుని వలన కలుగు "ఫలము"లోని శ్రేష్టపదార్ధముల వలన యెహోవా ఎవరి భూమిని దీవించును?
3. షూలమ్మితీ శ్వాసవాసన దేని "ఫల"సువాసన వలె నున్నది?
4. అంజూరపు పండ్ల"ముద్ద ఎవరికి కలిగిన పుండు మీద పెట్టగానే అతడు బాగుపడెను?
5. ద్రాక్షా"పండ్ల" యొక్క ఏమి పెట్టి నన్నాదరించుడి అని షూలమ్మితీ అనెను?
6. నా పర్వతము చుట్టుపట్ల స్థలములను నేను ఎలా చేయునప్పుడు ఫలవృక్షములు "ఫలము"లిచ్చునని యెహోవా అనెను?
7. నా ప్రాణమునకిష్టమైన యొక క్రొత్త అంజూరపు"పండు"లేకపోయెనని ఎవరు అనెను?
8. దేని వలన కలుగు ఫలము ముసిణి"పండంత" చేదు?
9. షూలమ్మితి యొక్క కణతలు విచ్చిన దేని "ఫలము"వలె కనబడుచున్నవి?
10. ప్రదేని సూచకమైన ద్రాక్ష చెట్లు "ఫలమిచ్చునని" యెహోవా అనెను?
11. ద్రాక్ష చెట్లు "ఫలింపక"పోయినను నేను యెహోవా యందు ఆనందించెదనని ఎవరు అనెను?
12. వృక్షఫలము"లలో దశమభాగము యెహోవా యొక్క ఏమై యుండెను?
13. దేని వేసవికాల "ఫలముల"మీద పాడుచేయువాడు పడెను?
14. ఏ దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు మంచి అంజూరపు "పండ్లను"లక్ష్యపెట్టునట్లు యెహోవా లక్ష్యపెట్టును?
15. ద్రాక్ష "పండ్లను "కోసినప్పుడు వెనుక నున్న పరిగె ఎవరికి ఉండునట్లు దాని ఏరుకొనకూడదు?
Result: