1 . "పక్షిరాజు" ఆహార విషయములో ఎటువంటిది?
2 . "పక్షిరాజు" యెహోవా ఆజ్ఞకు లోబడి ఎక్కడికి ఎక్కును?
3 . "పక్షిరాజు" వలె నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకొనినను నిన్ను క్రిందకు పడద్రోయుదునని యెహోవా ఎవరితో చెప్పెను?
4 . "పక్షిరాజు" రెక్కల ఈకెల వంటివి ఎవరికి వచ్చెను?
5 . పెద్ద రెక్కలుగల గొప్ప "పక్షిరాజు" ఏ పర్వతము మీదికి వచ్చెను?
6 . జనులు ధర్మశాస్త్రము మీరినందున "పక్షిరాజు"వ్రాలినట్టు ఎవరు యెహోవా మందిరమునకు వచ్చును?
7 . తండ్రిని ఏమి చేయువాని కన్ను "పక్షిరాజు" పిల్లలు తినును?
8 . నా దినములు ఎరమీదకు తినుటకు దిగు "పక్షిరాజు"వలె త్వరపడి పోవునని ఎవరు అనెను?
9 . ఏది "పక్షిరాజు" ఆకాశమునకు ఎగిరిపోవునట్లు ఎగిరిపోవును?
10 . ఎవరు పక్షిరాజు" వలె వడిగలవారు?
11 . ఆకాశమధ్యమున ఒక "పక్షిరాజు" ఎగురుచు ఎవరికి అయ్యో అయ్యో అయ్యో అని చెప్పెను?
12 . యెహోవా రేపుచున్న ఎవరు "పక్షిరాజు" వడిగా వచ్చునట్లు వచ్చును?
13 . యెహోవా కొరకు ఏమి చేయువారు "పక్షిరాజు" వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు?
14 . "పక్షిరాజు" యొక్క దేనివలె మన యొక్క దానిని క్రొత్తదిగా యెహోవా చేయును?
15. వేటి యొక్క ముఖములు "పక్షిరాజు" ముఖముల వంటివి?
Result: