1. పరిశుద్ధగ్రంధములో ఏ పక్షి గురించి ఎక్కువగా ప్రస్తావించబడెను?
2. నేను "నిప్పుకోళ్ళకు" జతకాడనైతినని ఎవరు అనెను?
3. ఎక్కడ నున్న "కౌజుపిట్టను"తరిమినట్టు నన్ను వెదకుటకై బయలుదేరి వచ్చితివని దావీదు సౌలుతో అనెను?
4. యెహోవా పాడు చేసిన ఏ పట్టణములో "పక్షుల"శబ్దము కిటికీలలో నుండి వినబడును?
5. ఆకాశమున ఎగురు "సంకుబుడి కొంగ" యైనను ఏమి నెరుగును?
6. యెహోవా యొక్క ఎక్కడ పిల్లలు పెట్టుటకు "వానకోవెలకు"గూటి స్థలము దొరికెను?
7. "గూడబాతులు"ఏ దేశమును ఆక్రమించుకొనును?
8. " నిప్పుకోడి" మూల్గునట్లు మూల్గుచున్నానని ఎవరు అనెను?
9. ఎక్కడ నుండి యెహోవా "క్రూరపక్షిని" రప్పించును?
10. ఎన్ని రకముల "పక్షులు"మనకు హేయములని యెహోవా సెలవిచ్చెను?
11. మంగలకత్తి పిట్ట, ఓదె కొరుకు" వలెను నేను కిచకిచ లాడితినని ఎవరు అనెను?
12. ఎటువంటి స్థలములలోని "పగిడికంటె" వలె నున్నానని కీర్తనాకారుడు అనెను?
13. తండ్రిని ఏమి చేయు వాని కన్ను "లోయ కాకులు" పీకును?
14. నీ బోడితనమును "బోరు గద్ద"వలె కనుపరచుకొనుమని యెహోవా దేనికి సెలవిచ్చెను?
15. యెహోవా యొక్క గుర్రములు "గద్దల"కంటే ఏమి గలవి?
Result: