1. తన తండ్రి యాకోబుకిచ్చిన దేని నిమిత్తము ఏశావు ఆతని మీద "పగ" పట్టెను?
2. "పగ"వాడు ఎన్ని ముద్దులు పెట్టును?
3. యోసేపును ఎవరు ఎక్కువగా ప్రేమించుట చూచి ఆతని సహోదరులు ఆతని మీద "పగపట్టిరి?
4. నరహంతకుడు "పగ పట్టి హత్య చేయని యెడల ఆతను పారిపోవుటకు యెహోవా వేటిని ఏర్పర్చమనెను?
5. ఎవరు సమ్సోను భార్యను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి గనుక ఆతడు వారి మీద "పగ"తీర్చుకొనెను?
6. ఆమెను తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకు ఎవరు ఆతని మీద "పగ"యుంచెను?
7. "పగవాడు పెదవులతో మాయచేసి అంతరంగములో ఏమి దాచుకొనును?
8. మా విరోధియగు "పగవాడు" దుష్టుడైన ఈ హామానే అని ఎవరు రాజుతో అనెను?
9. దేని మీద "పగ" తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెనని యెహోవా అనెను?
10. ఎవరు దేవుని తృణీకరించుచు "పగ"ను కలిగినందున యెహోవా వారికి ప్రతికారము చేయును?
11. నా మీద మిట్టిపడువాడు నాయందు "పగ" పట్టినవాడు కాడని ఎవరు అనెను?
12. "పగ" వాడు ఆకలిగొనినపుడు వానికి భోజనము పెట్టుట వలన వాని తలమీద ఏమి కుప్పగా పోయుదువు?
13. "పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకు యెహోవా బాలురు చంటిపిల్లల స్తుతుల మూలముగా ఏమి స్థాపించెను?
14. యెహోవా నా విషయమై "పగ" తీర్చును అని దావీదు ఎవరితో అనెను?
15. "పగ" వాని యింట దేని మాంసము తినుట కంటె ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు?
Result: