Bible Quiz in Telugu Topic wise: 50 || తెలుగు బైబుల్ క్విజ్ ("National day Day of King" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. రాజు ప్రజలను ఏమి చేయును?
ⓐ ఏలును
ⓑ పాలించును
ⓒ కాపాడును
ⓓ పైవన్నియు
2. ఏవి రాజును కాపాడును?
ⓐ ధనసంపదలు
ⓑ బలశౌర్యములు
ⓒ కృపాసత్యములు
ⓓ ఐశ్వర్య ఘనతలు
3. దరిద్రులకు ఎలా న్యాయము తీర్చు రాజు యొక్క సింహాసనము స్థిరపరచబడును?
ⓐ ధర్మముగా
ⓑ సత్యముగా
ⓒ నీతిగా
ⓓ వివేకముగా
4. దేని విషయమై రాజు శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములందు మేలు కలుగును?
ⓐ భూమి
ⓑ నిధులు
ⓒ ఇండ్లు
ⓓ సంపదలు
5. రాజు గొప్ప ఇంటివాడై యుండుట దేశమునకు ఏమై యున్నది?
ⓐ బలము
ⓑ శుభము
ⓒ ఐశ్వర్యము
ⓓ క్షేమము
6. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో ఏమి చెదరగొట్టును?
ⓐ శత్రువులను
ⓑ లంచగొండులను
ⓒ చెడుతనమంతయు
ⓓ బుద్ధిహీనతను
7. సంగతి శోధించుట రాజులకు ఏమై యున్నది?
ⓐ ఆశ
ⓑ ఉత్సాహము
ⓒ మంచిది
ⓓ ఘనత
8. రాజులను నశింపజేయు ఎవరితో వారు సహవాసము చేయకూడదు?
ⓐ మిత్రులతో
ⓑ ఇంటివారితో
ⓒ నెళవరులతో
ⓓ స్త్రీలతో
9. మనసును రాజును ఏమి చేయకూడదు?
ⓐ దూషింపకూడదు
ⓑ అసహ్యించకూడదు
ⓒ శపింపకూడదు
ⓓ ఏవగించకూడదు
10. ఎవరు రాజై యుండుట దేశమునకు అశుభము?
ⓐ బుద్దిహీనుడు
ⓑ దాసుడు
ⓒ ముర్ఖుడు
ⓓ అవివేకి
11. రాజులు పోషించే ఎటువంటి వారిగా నుందురని యెహోవా సెలవిచ్చుచుండెను?
ⓐ తండ్రులుగా
ⓑ పాలకులుగా
ⓒ దాయాదులుగా
ⓓ ఇంటియజమానునిగా
12. రాజు వలన భయము దేని వంటిది?
ⓐ తోడేలు చూపు
ⓑ సింహగర్జన
ⓒ పులి గాండ్రింపు
ⓓ నక్క అరుపు
13. ఏమి చేయబడిన రాజును మనము కన్నులారా చూచెదము?
ⓐ అభిషేకింపబడిన
ⓑ ఆసీనుడైన
ⓒ అలంకరింపబడిన
ⓓ సిద్ధము చేయబడిన
14. ఈ రాజు మన ప్రభువు మన యొక్క ఏమి కోరినవాడు?
ⓐ సౌందర్యము
ⓑ సంపద
ⓒ ఐశ్వర్యము
ⓓ నైవేద్యము
15. మనము రాజులైన ఏ సమూహమై యున్నాము?
ⓐ అధిపతుల
ⓑ పాలక
ⓒ సైనిక
ⓓ యాజక
Result: