1. "Epistle" అనగా అర్ధము ఏమిటి?
2. పౌలు సంఘములను స్థాపించిన తరువాత మొదట ఏ సంఘమునకు "పత్రిక"వ్రాసెను?
3. కొలొస్సయుల సంఘమునకు ఎవరు తనను గూర్చిన సంగతులు తెలియజేయునని పౌలు వారికి పత్రికలో వ్రాసెను?
4. మీరు పంపిన వస్తువులు మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై యున్నవని పౌలు ఏ సంఘమునకు "పత్రిక"వ్రాసెను?
5. దేని విషయమై శిశువులుగా ఉండుడని పౌలు కొరింథీ సంఘమునకు "పత్రికలో" వ్రాసెను?
6. యేసుక్రీస్తు నందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులై యుందురని ఏ సంఘమునకు పౌలు తన "పత్రికలో "వ్రాసెను?
7. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవము నందు మీరు వాక్యము నంగీకరించిరని పౌలు ఏ సంఘమునకు "పత్రికలో" వ్రాసెను?
8. అందరియెడల కరుణ చూపవలెనని దేవుడు అందరిని ఏ స్థితిలో మూసివేసి బంధించియున్నాడని పౌలు రోమా "పత్రికలో" వ్రాసెను?
9. ఒకడు ఏమి కలిగి యుంటే శక్తికి మించి కాదు కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగునని పౌలు కొరింథీయుల రెండవ "పత్రికలో" వ్రాసెను?
10. నా నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడని పౌలు ఏ సంఘమునకు "పత్రిక" వ్రాసెను?
11. ఏమైన ప్రతికార్యమును బలముతో సంపూర్ణము చేయుమని పౌలు రెండవ థెస్సలొనీకయ "పత్రికలో" వ్రాసెను?
12. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారమని పౌలు ఎవరికి "పత్రిక"వ్రాసెను?
13. ఎవరికి ఏమియు తక్కువ కాకుండా చూడుమని పౌలు తీతుకు "పత్రికలో" వ్రాసెను?
14. ప్రభువు నందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము అని పౌలు ఎవరికి "పత్రికలో వ్రాసెను?
15. సహోదర ప్రేమ నిలువరముగా యుండనియ్యుడి,ఆతిథ్యము చేయ మరువకుడని పౌలు ఏ సంఘమునకు "పత్రికలో" వ్రాసెను?
Result: