1. "FAMILY" అనగా ఏమిటి?
2. భూమి మీద మొదటి "కుటుంబమైన"ఆదాము హవ్వల మూడవ కుమారుని పేరేమిటి?
3. ఏ దేశములో యెహోవా యోసేపుకు "కుటుంబమును"ఏర్పర్చెను?
4. ఏ అరణ్యమందు యెహోవా ఇశ్రాయేలీయులను పితరుల "కుటుంబములను"బట్టి లెక్కించమని మోషేతో చెప్పెను?
5. అతిపరిశుద్ధమైన దాని విషయములో సేవ చేయుట ఏ "కుటుంబములకు"వచ్చెను?
6. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని ఎవరు యెహోవాకు మనవి చేసెను?
7. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడిన ఎవరి "కుటుంబములను"భూమి తన నోరు తెరచి మ్రింగివేసెను?
8. అంతకంతకు నీరసిల్లిపోయిన "కుటుంబము"ఎవరిది?
9. బహుమానము ఆశించిన ఎవరు తనకు తన "కుటుంబముకు"కుష్టము కలిగించుకొనెను?
10. ఏ యూదా రాజు కాలములో యుద్ధమునకు వచ్చిన శత్రువులను బట్టి యెహోవాను వేడుకొనుటకు జనులు "కుటుంబములతో" వచ్చిరి?
11. భయంకరమైన శ్రమల గుండా వెళ్ళి సహనముతో ఓర్చుకొన్న ఎవరు తిరిగి దేవుని వలన తన "కుటుంబమును"పొందుకొనెను?
12. గుణవతియైన భార్య తన "కుటుంబమును" గురించి శ్రద్ధతీసుకొనే విధానమును ఎవరు తెలిపెను?
13. ప్రపంచ "కుటుంబములు" యెహోవా దృష్టికి నీతిమంతుడుగా యున్న ఎవరి సంతానము నుండి వచ్చెను?
14. జనముల"కుటుంబములు"నీ వలన ఆశీర్వదింపబడునని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
15. ఏ "కుటుంబము "యెహోవా వలన సూచనలుగా మహాత్కార్యములుగా యుండెను?
Result: