1. చెట్లను, వృక్షములను దేవుడు ఏ దినమున సృజించెను?
2 . లెబానోనులో యున్న దేని గూర్చి, గోడలో మొలుచు దేని ఏ మొక్కతో సహా,వేటిని గూర్చి సొలొమోను వ్రాసెను?
3 . ఏ తోటలో ఫలవృక్షములతో పాటు పూలచెట్లను దేవుడు యుంచెను?
4 . ఇశ్రాయేలు నివాసస్థలములో దేవుడు సువాసన నిచ్చే ఏ పూల చెట్లను నాటెను?
5 . పువ్వులు ఎక్కడ పూసి యున్నవి?
6. ఏ పుష్పము బాగుగా పూయుచు ఉల్లసించును?
7 . ఏ పువ్వులను దేవుడు అలంకరించెను?
8 . ఎవరి అందమంతయు అడవిపువ్వుల వలె నున్నది?
9 . దేవుని శాసనముల యెదుట యుంచిన అహరోను కర్ర చిగిర్చి ఏ చెట్టు పువ్వులు పూసెను?
10 . బలురక్కసి చెట్ల మధ్య ఏ పూల చెట్టు కలదు?
11. తామర పుష్పము పెరుగునట్లు ఇశ్రాయేలు ఏమి నొందును?
12 . షారోను పొలములో పూయు పుష్పము ఎవరు?
13 . ద్రాక్షావనములోని ఏ చెట్టు పూగుత్తులతో ప్రియుడైన యేసు సమానుడు?
14 . లేతమొక్క వలె క్రీస్తు మనయందు తనకున్న ప్రేమతో పరిమళ వాసనగా దేవునికి ఎలా అప్పగించుకొనెను?
15. పరిమళపుష్ప, ఫలభరిత ఆత్మీయ సత్య కావ్యగ్రంధము ఏది?
Result: