Bible Quiz in Telugu Topic wise: 54 || తెలుగు బైబుల్ క్విజ్ ("National Judges Day" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఎవరిని పుట్టించెను?
ⓐ ప్రవక్తలను
ⓑ దీర్ఘదర్శులను
ⓒ న్యాయాధిపతులను
ⓓ రాజులను
2 . న్యాయాధిపతుల గ్రంధమును వ్రాసిన వారెవరు?
ⓐ ఒత్నీయేలు
ⓑ కనజు
ⓒ కేయీను
ⓓ సమూయేలు
3 . న్యాయాధిపతులు ఎవరి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి?
ⓐ శత్రువుల
ⓑ దోచుకొనువారి
ⓒ అన్యరాజుల
ⓓ పగవారి
4 . న్యాయాధిపతుల మాట వినక ఇశ్రాయేలీయులు యితర దేవతలతో ఏమి చేసిరి?
ⓐ జారత్వము
ⓑ అపవిత్రకార్యము
ⓒ వ్యభిచారము
ⓓ చెడ్డపని
5 . ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా ఇశ్రాయేలీయులు తమ క్రియలలో మూర్ఖ ప్రవర్తనలో ఎవరి కంటే చెడ్డవారైరి?
ⓐ తండ్రుల
ⓑ సహోదరుల
ⓒ పొరుగువారి
ⓓ పితరుల
6 . ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి యైన ఎవరు రాజైన కూషన్రీషాతాయిమును జయించెను?
ⓐ కనజు
ⓑ ఆరాము
ⓒ ఒత్నీయేలు
ⓓ షాఫాను
7 . మోయాబు రాజైన ఎగ్లోనును ఏ న్యాయాధిపతి జయించి ఇశ్రాయేలీయులను రక్షించెను?
ⓐ ఏహూదు
ⓑ హూరాము
ⓒ నెబోయాము
ⓓ హిమ్రీము
8 . ఫిలిష్తీయులలో ఆరువందల మందిని మునుకోల కర్రతో హతము చేసిన న్యాయాధిపతి ఎవరు?
ⓐ షెమరు
ⓑ షమ్గరు
ⓒ షోయాను
ⓓ షిబ్యా
9 . ప్రవక్తిని అయిన ఎవరు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా నుండెను?
ⓐ యాయేలు
ⓑ హసోను
ⓒ అహీర
ⓓ దెబోరా
10 . మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిన న్యాయాధిపతి ఎవరు?
ⓐ బాలాకు
ⓑ హెబెరు
ⓒ హోబాబు
ⓓ గిద్యోను
11 . ఇశ్శాఖారు గోత్రికుడైన ఎవరు న్యాయాధిపతిగా నుండెను?
ⓐ పువ్వా
ⓑ తోలా
ⓒ దెదాను
ⓓ యెర్గెషు
12 . గిలాదుదేశస్థుడైన ఎవరు న్యాయాధిపతిగా నుండెను?
ⓐ గెర్షొను
ⓑ కిమీను
ⓒ యాయీరు
ⓓ యోతాము
13 . పరాక్రమము గల బలాఢ్యుడైన ఎవరు న్యాయాధిపతిగా నుండెను?
ⓐ షెకెము
ⓑ షల్లూము
ⓒ షెమెజరు
ⓓ యెఫ్తా
14 . బెత్లహేమీయుడైన ఎవరు న్యాయాధిపతిగా నుండెను?
ⓐ ఇష్బేను
ⓑ ఇష్టయి
ⓒ ఇబ్సాను
ⓓ ఇమేషు
15 . జెబూలూనీయుడైన ఎవరు న్యాయాధిపతిగా నుండెను?
ⓐ ఏలీము
ⓑ ఏలోను
ⓒ ఎమీషా
ⓓ ఎర్లీను
Result: