1. జ్ఞానము దేనికన్నా శ్రేష్టము?
2. యెహోవా జ్ఞానము చేత దేనిని స్థాపించెను?
3. జ్ఞానాధారమైన దేవుడు తన వశములో నున్న ఏ జ్ఞానమిచ్చును?
4. పైనుండి(దేవుని) వచ్చు జ్ఞానము మొట్టమొదట ఏమైనది?
5. జ్ఞానము కొదువగా ఉంటే సందేహించక దేవునిని ఎలా అడుగవలెను?
6. దేని కంటే జ్ఞానము ప్రయోజనకరము?
7. ఎవరి నోరు జ్ఞానోపదేశమును పలుకును?
8. ఎవరి మనస్సు జ్ఞానమును అనుసరించెను?
9. ఎవరు జ్ఞానహృదయులకు దాసుడగును?
10. దేవుడు ఎటువంటి జ్ఞానమును నరుల హృదయమందుంచెను?
11. క్రీస్తునందు సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైన సంఘము ఏది?
12. జ్ఞానము మనుష్యులముఖమునకు ఏమి ఇచ్చును?
13. సమస్త విధములైన జ్ఞానముతో దేనిని మనలో సమృద్ధిగా నివసింపనియ్యవలెను?
14. వేటికంటే జ్ఞానము శ్రేష్టము?
15. క్రీస్తు జనుల దోషమును భరించి తన అనుభవజ్ఞానము చేత అనేకులను ఏమి చేయును?
Result: