Bible Quiz in Telugu Topic wise: 7 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Commadments" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. Commandments అనగా ఏమిటి?
ⓐ ఆజ్ఞలు
ⓑ విధులు
ⓒ కట్టడలు
ⓓ ఉపదేశములు
2. యెహోవా తన "ఆజ్ఞలను" ఎలా గైకొనవలెనని ఆజ్ఞాపించెను?
ⓐ త్వరితముగా
ⓑ జాగ్రత్తగా
ⓒ ఆలోచితముగా
ⓓ మంచిగా
3. యెహోవా ఆజ్ఞలన్నిటిని లక్ష్యము చేయునపుడు ఏమి కలుగనేరదు?
ⓐ సిగ్గు
ⓑ నింద
ⓒ అవమానము
ⓓ ఆపద
4. యెహోవా ఆజ్ఞలను విడిచి తిరుగువారు ఏమవుదురు?
ⓐ శాపగ్రస్తులు
ⓑ అబద్ధికులు
ⓒ ద్రోహులు
ⓓ దుర్మార్గులు
5. యెహోవా ఆజ్ఞలన్నియు ఏమై యున్నవి?
ⓐ మంచివి
ⓑ నమ్మదగినవి
ⓒ వినదగినవి
ⓓ నడిపించేవి
6. బంగారము కంటెను అపరంజి కంటెను యెహోవా ఆజ్ఞలు ఎలా యున్నవి?
ⓐ మధురముగా
ⓑ ఇష్టముగా
ⓒ ప్రియముగా
ⓓ తీపిగా
7. యెహోవా ఆజ్ఞలన్నియు ఎటువంటివి?
ⓐ కఠినమైనవి
ⓑ సులువైనవి
ⓒ కష్టమైనవి
ⓓ సత్యమైనవి
8. యెహోవా ఆజ్ఞను నెరవేర్చు దేనిని ఆయనను స్తుతించుమని కీర్తనాకారుడు అనెను?
ⓐ తుఫానును
ⓑ మంచును
ⓒ పొగను
ⓓ వడగండ్లను
9. యెహోవా ఆజ్ఞలను ఎలా గైకొనవలెను?
ⓐ హృదయపూర్వకముగా
ⓑ ఖండితముగా
ⓒ నమ్మకముగా
ⓓ కంఠపాఠముగా
10. యెహోవా ఆజ్ఞ ఎలా యుండును?
ⓐ సిద్ధిగా
ⓑ కాంతిగా
ⓒ దీపముగా
ⓓ వితానముగా
11. యెహోవా ఆజ్ఞలను నేర్చుకొనునట్లు ఏమి దయచేయుమని కీర్తనాకారుడు ఆయనను అడుగుచుండెను?
ⓐ జ్ఞానము
ⓑ వివేచన
ⓒ వివేకము
ⓓ బుద్ధి
12. యెహోవా ఆజ్ఞలు నిత్యము ఎలా నున్నవి?
ⓐ తోడుగా
ⓑ ఛాయగా
ⓒ గమ్యముగా
ⓓ నీడగా
13. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ కొంత అచ్చట కొంత ఇచ్చట చెప్పుచున్నాడని ఎవరు అనుకొందురు?
ⓐ అష్టూరీయులు
ⓑ ఎఫ్రాయిమీయులు
ⓒ మోయాబీయులు
ⓓ మనషీయులు
14. దేవుని ఆజ్ఞల ప్రకారము నడచుటయే ఏమై యున్నది?
ⓐ విశ్వాసము
ⓑ వినయము
ⓒ ప్రేమ
ⓓ సత్యము
15. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నదని క్రొత్త ఆజ్ఞ ఇచ్చినదెవరు?
ⓐ పేతురు
ⓑ ఫిలిప్పు
ⓒ పౌలు
ⓓ యోహాను
Result: