Bible Quiz in Telugu Topic wise: 70 || తెలుగు బైబుల్ క్విజ్ ("World Environment Day" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. ఆకాశమును భూమిని దేవుడు ఏ దినములలో సృజించెను?
ⓐ రెండవ : మూడవ
ⓑ మూడవ ; నాలుగవ
ⓒ ఒకటవ ; మూడవ
ⓓ ఆరవ ; అయిదవ
2. చెట్లు ఫలవృక్షములు గడ్డిజాతులను దేవుడు ఏ దినమున సృజించెను?
ⓐ ఆరవ
ⓑ మూడవ
ⓒ అయిదవ
ⓓ నాలుగవ
3. జలచరములు భూచరములు పక్షులు మహామత్స్యములను దేవుడు ఏ దినమున సృజించెను?
ⓐ ఒకటవ
ⓑ మూడవ
ⓒ అయిదవ
ⓓ యేడవ
4. పశువులు అడవిజంతువులు పురుగులు, నరుని దేవుడు ఏ దినమున చేసెను?
ⓐ మూడవ
ⓑ ఒకటవ
ⓒ అయిదవ
ⓓ ఆరవ
5 . ఏ తోటను నిర్మించి దానిలో దేవుడు నరుని ఉంచెను?
ⓐ గెత్సెమనే
ⓑ తిర్సా
ⓒ ఏదెను
ⓓ మహనయీము
6. ఏదెను తోటను తడుపుటకు దేవుడు ఒక నదిని ఏర్పర్చగా అది ఎన్ని శాఖలాయెను?
ⓐ అయిదు
ⓑ నాలుగు
ⓒ మూడు
ⓓ ఆరు
7 . అబ్రాహాము ఎండవేళ ఏ వనములో కూర్చుండెను?
ⓐ తిర్సా
ⓑ గొల్గొతా
ⓒ సింధూర
ⓓ తెప్సెయి
8 . అబ్రాహాము బయెర్షీబాలో ఏ వృక్షము నాటెను?
ⓐ సరళ
ⓑ గొంజి
ⓒ దేవదారు
ⓓ పిచుల
9 . భూమి మీద నున్న జంతువులకు ఆకాశపక్షులకు సమస్తజీవులకు ఏవి ఆహారమగునని దేవుడు పలికెను?
ⓐ పచ్చనిచెట్లన్నియు
ⓑ గడ్డి జాతులు
ⓒ విత్తనముల మొక్కలు
ⓓ వృక్షములు
10 . ఫలభరితమైన భూమి ఎలా నుండును?
ⓐ పచ్చగా
ⓑ వృక్షవనముగా
ⓒ అందమైనతోటగా
ⓓ సమృద్ధిగా
11 . లెబానోనులో ఉండు ఏ వృక్షము, గోడలో నుండి మొలుచు ఏ మొక్క మరియు వేటి గురించి సొలొమోను వ్రాసెను?
ⓐ దేవదారు
ⓑ హిస్సోపు
ⓒ చెట్లన్నిటిని
ⓓ పైవన్నియు
12 . యెహోవాను నమ్ముకొనువాడు వేటి యొద్ద నాటబడిన చెట్టువలె నుండును?
ⓐ నదుల
ⓑ సముద్రముల
ⓒ జలముల
ⓓ సరస్సుల
13 . జీవగ్రంధములో సొలొమోను వేటి గురించి వ్రాసెను?
ⓐ మృగములు;పక్షులు
ⓑ ప్రాకు జంతువులు
ⓒ జలచరములు
ⓓ పైవన్నియు
14 . కొండలు పర్వతములు వాటి ఉనికి, జీవుల ఆహారము వాటి భద్రత, నరులకు రక్షణను ఇచ్చి నడిపించేది ఎవరు?
ⓐ యెహొవా
ⓑ దేవదూతలు
ⓒ భూమ్యాకాశములు
ⓓ సెరాపులు
15 . యేసు ఏ తోటకు వెళ్ళి ప్రార్ధన చేసెడివారు?
ⓐ తిర్సా
ⓑ తెప్సెయి
ⓒ సింధూర
ⓓ గెత్సేమనే
Result: